NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Breaking: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు హైదరాబాద్‌లో స్వల్ప అస్వస్థత..! ఏమైందంటే..?

Breaking: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. హైదరాబాద్ ‌లోని కామినేని ఆసుపత్రిలో చేరారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్న దీపిక మంగళవారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఒక్కసారిగా హార్ట్ బీట్ (గుండె వేగంగా కొట్టుకోవడం) పెరగడంతో కంగారుపడిన దీపిక షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన కామినేని ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తొంది. కామినేని ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం ఆమె తను ఉంటున్న నోవాటెల్ హోటల్ కు వెళ్లిపోయారట. ఆమె వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో నోవాటెల్ లో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం దీపిక ఆరోగ్యం నిలకగడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వైద్యులు సూచించినట్లు తెలుస్తొంది. దీపిక అనారోగ్యానికి సంబంధించి పూర్తి సమాచారం అధికారికంగా తెలియరాలేదు.

Breaking: Bollywood heroine Deepika Padukone falls ill in Hyderabad
Breaking Bollywood heroine Deepika Padukone falls ill in Hyderabad

 

దీపిక నాలుగు రోజుల క్రితం (10వ తేదీ) కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పదవ తేదీ ఆమె తండ్రి, మాజీ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలను సందర్శించారు. విఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు. పఠాన్ మూవీతో దీపికా బిజీగా ఉన్నారు. ఆ మూవీలో దీపికా షారుక్ ఖాన్ సరసన నటిస్తున్నారు. దీనితో పాటు మరో హాలీవుడ్ చిత్రానికి దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల టాక్. మంగళవారం దీపిక అర్ధాంతరంగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఆసుపత్రికి వెళ్లడంతో తొలుత ఆందోళన చెందారు. అయితే ఆ తరువాత ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఊరట చెందారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar