Breaking: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు అయ్యింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రఘురామతో పాటు ఆయన తనయుడు, భద్రతా సిబ్బందిపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఏపికి చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుబానీ అలియాస్ ఫరూక్ బాషాపై దాడి చేశారన్న అభియోగంపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషాపై నిన్న రఘురామ భద్రతా సిబ్బంది దాడి చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అప్పగించిన సంగతి తెలిసిందే.
తాను ఏపి కానిస్టేబుల్ ని అని చెబుతున్నా వినకుండా తనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారంటూ బాషా పోలీసులకు వివరించారు. తన ఐడీ కార్డు, పర్సు కూడా లాక్కుకున్నారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్ తో పాటు సీఆర్‌పీఎఫ్ కు చెందిన ఎఎస్ఐ, కానిస్టేబుల్ సందీప్, రఘురామ పీఎ శాస్త్రిలపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో సదరు సీఆర్‌పీఎస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తొంది.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…