Breaking: హైదరాబాద్ నానక్ రాంగూడలోని బావర్చి హటల్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ రెండవ అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు రెండవ అంతస్తు నుండి మూడవ అంతస్తుకు వ్యాపించాయి. అగ్నిప్రమాదం సంభవించడంతో హోటల్ సిబ్బంది, మరి కొందరు పై అంతస్తుకు వెళ్లి సాయం కోసం హాహాకారాలు చేశారు. దట్టంగా వ్యాపించిన పొగ వల్ల ఊపిరి ఆడక పలువురు అస్వస్థతకు గురైయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాద విషయం తెలిన వెంటనే అగ్నిమాపక, పోలీస్ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అగ్నిమాప సిబ్బంది భారీ క్రైన్ సహాయంతో ఒక పక్క మంటలను అదుపు చేస్తూనే పై అంతస్తుకు చేరుకున్న వారిని అస్వస్థతకు గురైన వారిని కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు తీసుకురావడం జరిగిందని, దట్టమైన పొగతో ఊపిరి ఆడక ఇబ్బందులు పడ్డవారని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు అగ్ని మాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై విచారణ జరుపుతామని జిల్లా ఫైర్ అధికారి శ్రీధర్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది, కస్టమర్లు పరుగులు తీశారు. 15 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారని హోటల్ యాజమాన్యం తెలిపింది. దట్టమైన పొగతో ఊపిరి ఆడక ఇబ్బందిపడ్డ సిబ్బందికి ప్రాధమిక చికిత్స అందించినట్లు తెలిపారు. హోటల్ పరిసర ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకోవడంతో అటుగా వెళ్లే వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. పొగ వల్ల కొద్ది సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
శ్రీధర్
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…