BREAKING: కన్నడ సినిమా హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం..

Share

BREAKING: కన్నడ సినీ దిగ్గజం, హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Raj Kumar) హఠాన్మరణం చెందారు. అతడు శుక్రవారం (అక్టోబర్ 29) ఉదయం తన నివాసంలో జిమ్ వర్క్ ఔట్స్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటొచ్చింది. దాంతో అతడు కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన స్థానిక విక్రమ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడి డాక్టర్లు(doctors) పునీత్ ప్రాణాలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అతని మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతని మరణం పట్ల యావత్ కన్నడ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది. చిన్న వయసులోనే పునీత్ ఇలా ప్రాణాలు విడవడం చాలా బాధిస్తోందని.. అతని లేని లోటు తీర్చలేనిదని కన్నడ(kanada) సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


Immunity Power: ఈ లక్షణాలు ఉంటే ఇమ్యూనిటీపవర్ లేనట్టే..!!

విషాదంలో మునిగి తేలుతున్న కన్నడ ఇండస్ట్రీ

ప్రస్తుతం కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు పునీత్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతూ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు మూవీస్ థియేటర్లు క్లోజ్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) ఆదేశించింది.

Romantic movie Review : పూరి జగన్నాధ్ తనయుడు ‘రొమాంటిక్’ సినిమాతో హిట్ అందుకున్నాడా..?

పునీత్ తెలుగువారికి సుపరిచితమే

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడవ సంతానం పునీత్‌ రాజ్‌కుమార్‌. ఇతడు చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అరంగేట్రం చేశాడు. ‘బెట్టడా హువు’ సినిమాలో అత్యద్భుతమైన నటనా ప్రదర్శన కనపరిచే ఉత్తమ చైల్డ్ గా అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. సినిమాలో కథానాయకుడిగా 32 చిత్రాల్లో నటించి కన్నడ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. వసంత గీత, ఏడు నక్షత్రాలు, యరివాను తదితర చిత్రాలు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఇటీవల కూడా అతడు నటించిన యువరత్న సినిమా సూపర్ హిట్ అయింది. అయితే అతను నటించిన సినిమాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. ఆ విధంగా అతడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.


Share

Related posts

Golden Brunei King : ఆ రాజు వైభోగం చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే.. ప్రతి అంగుళం బంగారుమయం..!

Teja

GooseBerry: ఉసిరికాయ  ను  ఆదివారం ఎందుకు తినకూడదో తెలుసా??కారణం తెలిస్తే  ముట్టుకోరు!!

siddhu

AP High Court: రాజధాని రైతులకు గుడ్ న్యూస్..! ఆ జీవో కొట్టివేతతో షాక్..!!

Srinivas Manem