Breaking: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మా ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. సినీ కార్మికులకు, పెద్దలకు మా ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. మరి ఈ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలలోని సినీ అభిమానులు ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తేదీ తెలిసింది. అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ‘మా’ క్రమశిక్షణ సంఘం వెల్లడించింది. మా ఎన్నికల గంట మోగడంతో ఇక ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి.
అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్ సభ్యులు ప్రచారాలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారోనని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, హేమలు ఉన్నారు. ఇక ఆఖరికి ఎవరు గెలుస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇక మా ఎన్నికల్లో గెలుపుపై ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?