NewsOrbit
న్యూస్

BREAKING – Maa Elections : మంచు విష్ణు కి షాక్ .. ‘ఆ’ వీడియోలు బయట పెట్టిన ప్రకాష్ రాజ్ …!

BREAKING – Maa Elections : తెలుగు ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ వివాదం ఇంకా చల్లారడం లేదు. ఇందులో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేసిన విషయం తెలిసింది. ఇందులో మంచి విష్ణు విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ వారికి ఆయా సినీ పెద్దలు మద్దతు తెలిపారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు మెగా ఫ్యామిలీ అండగా నిలవగా.. మంచు విష్ణు ప్యానెల్‌కు కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి సీనియర్ నటులు సపోర్ట్ చేశారు. విజయం సాధించిన మంచు విష్ణు(Manchu vishnu) ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు సైతం స్వీకరించారు. అయినా ఈ ఎలక్షన్స్ వేడి తగ్గడం లేదు. ఎలక్షన్స్ జరిగిన తీరుపై, వ్యవహారంపై ఆగ్రహానికి గురైన ప్రకాశ్ రాజ్ (prakash raj).. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన పలువురు వారి పదవులకు రిజైన్ చేశారు. ఇప్పటికీ ప్రకాశ్‌రాజ్ తరపు నుంచి ఆరోపణలు ఆగడం లేదు. ఒకరిని మరొకరు విమర్శించుకుంటూనే ఉన్నారు.

BREAKING – Maa Elections : మంచు విష్ణు కి షాక్ .. ‘ఆ’ వీడియోలు బయట పెట్టిన ప్రకాష్ రాజ్ …!

సీసీ‌టీవీ ఫుటేజ్ ఇవ్వండి..

ఎన్నికల్లో అవకతవకలను పాల్పడ్డారని ప్రకాశ్‌రాజ్ ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్‌ (krishna mohan) ను నటుడు ప్రకాశ్‌రాజ్ కోరారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో ఫుటేజీలను తీసుకుని పరిశీలించారు. అనంతరం ప్రకాశ్‌రాజ్ స్పందిస్తూ.. అవకతవకలు జరిపారంటూ మంచు విష్ణు ప్యానెల్‌పై ఆరోపణలు చేస్తున్నారు.

Maa Election’s: ప్రకాష్ రాజ్ కి ఊహించని షాక్ ఇచ్చిన “మా” ఎన్నికల అధికారి..!!
సాక్ష్యాలు ఉన్నాయి

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(maa) ఎలక్షన్స్ కొనసాగుతున్న టైంలో బయట నుంచి వేరే వ్యక్తులు లోపలికి వచ్చి, అక్కడ ఇబ్బందులకు గురిచేశారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయన్నారు. రౌడీ‌షీటర్ నూకల సాంబశివరావు సైతం అక్కడే ఉన్నట్టు తెలిపారు. దానికి సంబంధించిన వీడియోలు సైతం తన వద్ద ఉన్నాయని వాటిని మరి కొద్దిసేపట్లో రిలీజ్ చేస్తానని వెల్లడించారు. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. నిజంగానే అవకతవకలు జరిగాయా? లేక ప్రకాశ్ రాజ్ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారా? అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది.

MAA: విష్ణు ప్రమాణ స్వీకారంలో మంచు మోహన్ బాబు హాట్ కామెంట్స్..!!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju