న్యూస్

Breaking: ఆ సుప్రసిద్ధ జ్యోతిష్య పండితులు ఇక లేరు.. మృతికి కారణం ఏమిటంటే..?

Share

Breaking: రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడైన జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇక లేరు. ఆయన ఈ రోజు గుండె పోటుతో మృతి చెందారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు ఆయనను పంజాగుట్ట లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేలోగానే ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. గత మూడు దశాబ్దాలకుపైగా ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి జోతిష్యం, పంచాంగం చెబుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో విశిష్ట గుర్తింపు పొందారు.

Breaking mulugu ramalingeswara siddhanti passed away
Breaking mulugu ramalingeswara siddhanti passed away

Breaking: పంచాంగ కర్తగా మారకముందు

గుంటూరు జిల్లాకు చెందిన ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి పూర్తి పేరు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి పంచాంగ కర్తగా మారకముందు ఎంఆర్ వరప్రసాద్ పేరుతో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. పలువురు సినీ కమెడియన్ లతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం జోతిష్యం, వాస్తు, పంచాంగ కర్తగా రాణించారు.

Read More:AP CM YS Jagan: ఈ విషయంలో జగన్ కు మోడీ షాక్ ఇవ్వడం ఖాయమే(గా)..??

ప్రముఖులు సంతాపం

నిజమైన జ్యోతిష్య ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేశారు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి. ఆయన చెప్పే రాశి ఫలాలను కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా దేశ విదేశాల్లో ఉండెే తెలుగు ప్రజలు విశ్వసిస్తుండే వారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం చెందిన విషయాన్ని తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Read More: Gudivada: గుడివాడ క్యాసినో కేసులో దిమ్మతిరగే ట్విస్ట్ – కొడాలి నాని మామూలోడు కాదు బాబోయ్..!


Share

Related posts

YS Jagan – KCR: “దమ్మున్న” పత్రిక తెలంగాణాలో ఆ పని చేయగలదా?జగన్ కాదమ్మా.. అక్కడున్నది కేసీఆర్!! టచ్ చేసి చూడు!

Yandamuri

Big Breaking Lock Down: మళ్ళీ లాక్ డౌన్..!? మే నెలలో తప్పదేమో..!?

Yandamuri

Today Horoscope జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar