NewsOrbit
న్యూస్

Breaking: హిజాబ్ వివాదంపై ముందస్తు విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు

Breaking: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదం సుప్రీం కోర్టు చెంతకు చేరిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదంపై ముందస్తు విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హోలీ పండుగ తరువాత విచారణ తేదీ నిర్ణయిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదనీ, స్కూల్ యూనిఫాం పై విద్యాసంస్థల నిబంధనలను విద్యార్ధులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేదాన్ని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సమర్ధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసింది. దీనిపై కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్ధినులు సుప్రీం కోర్టులో నిన్న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం కోర్టు ముందస్తు విచారణకు నిరాకరిస్తూ హోలీ పండుగ తరువాత విచారణ తేదీ ప్రకటిస్తామని పేర్కొంది.

Breaking news Hijab row in supreme court
Breaking news Hijab row in supreme court

Read More: CM YS Jagan: జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్..

Breaking: సుప్రీం కోర్టుకు చేరిన హిజాబ్ వివాదం

విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై గత నెల కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతల చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో హిజాబ్ కు మద్దతుగా, వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేసింది. ఈ నేపథ్యంలో హిజాబ్ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ పలువురు విద్యార్ధినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తొలుత హైకోర్టులో సింగిల్ జడ్జి ధర్మాసనం కేసు విచారించి తరువాత విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. పదిహేను రోజుల పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి. గత నెల 25వ తేదీన విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. తాజాగా మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

రేపు కర్ణాటకలో బంద్ కు పిలుపునిచ్చిన ముస్లిం సంఘాలు

మరో పక్క కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం సంఘాలు నిరసనలకు పిలుపు నిచ్చాయి. రేపు కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్త చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N