Breaking News: అమెరికాలో మనోడు చేసిన పనికి దేశం పరువు పోయింది..!?

Share

Breaking News: ఓ భారత వ్యక్తి అగ్రరాజ్యం అమెరికాలో నీచమైన పని చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అక్కడి న్యాయస్థానం అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు శిక్షా కాలం పూర్తి అయిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కూడా ఆదేశించింది. ఈ ఘటనతో అమెరికాలో భారతదేశం పరువు తీశాడంటూ మనవాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. చదువు సంస్కారం నేర్పుతుంది అంటారు. కానీ ఈ ఉన్నత చదువు చదివిన మనోడి బుద్ది మాత్రం వక్రమార్గం పట్టింది. మంచి ఉద్యోగం, బాగా సంపాదిస్తున్న ఈ భారత వ్యక్తి కటకటాల పాలు ఎందుకు అయ్యాడు, అతను చేసిన పాడు పని ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Breaking News: indian man in America charged with enticing 15 year old girl to engage in sexual activity
Breaking News: indian man in America charged with enticing 15 year old girl to engage in sexual activity

అక్కడి పోలీసు వర్గాల తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రదీష్ జెహన్ సెల్వరాజ్ (35) అనే భారత వ్యక్తి నెబ్రాస్కాలోని ఒమాహాలో నివాసం ఉండి మంచి ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత సంవత్సరం అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రదీష్ మైనర్లతో కామ వాంఛ తీర్చుకోవాలని భావించాడు. మైనర్ బాలికలను ట్రాప్ చేసే పనిలో భాగంగా ఆన్ లైన్ లో ఓ వ్యభిచార యాడ్ ను చూసి అతను స్పందించాడు. 2020 అక్టోబరు 26 నుండి నవంబరు 4 మధ్య ఓ 15 ఏళ్ల బాలికలను బుక్ చేసుకునేందుకు ఓ వ్యభిచార యాడ్‌ లో మెసేజ్ పెట్టాడు. అయితే ఈ యాడ్ కామాంధులను ట్రాప్ చేయడానికి పోలీసులు ఏర్పాటు చేసింది అన్న విషయాన్ని ఆ వ్యక్తి గుర్తించలేదు.

ప్రదీప్ సందేశానికి ఆన్ లైన్ లో ఓ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిణి 15 ఏళ్ల బాలికగా బదులిచ్చింది. దాంతో ఆ బాలికకు 80 డాలర్లు చెల్లించడానికి అంగీకరించిన ప్రదీప్ అలాగే ఈ డబ్బుతో మరో 12 ఏళ్ల బాలికతోనూ ఓరల్ సెక్స్ చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. వారిద్దరినీ ఒమాహాలో కలుసుకోవడానికి ప్రదీష్ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించిన ప్రదీప్ వారి కోసం మెక్‌డొనాల్డ్స్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ కూడా తీసుకెళ్లాడు. ఇక తన కోరిక తీర్చుకోవచ్చని కలలు కంటూ వారు కలుసుకోవాలనుకున్న చోటుకు వెళ్లిన ప్రదీప్ కు ఊహించని షాక్ ఎదురయ్యింది. ప్రదీష్‌ కంటే ముందుగానే అక్కడకు చేరుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రదీష్ నుంచి మెక్‌డొనాల్డ్స్ బ్రేక్‌ఫాస్ట్,  కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని రిమాండ్ కు తరలించారు. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రాగా ప్రాసిక్యూషన్ ప్రదీప్ నేరాన్ని రుజువు చేయడంతో ప్రదీప్ ను దోషిగా నిర్ధారించిన చీఫ్ యూఎస్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ రాబర్ట్ రొస్సిటర్ 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు శిక్షాకాలం పూర్తి అయిన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.


Share

Related posts

Bigg boss Rohini : షూటింగ్ లేకపోతే బిగ్ బాస్ రోహిణి చేసే పని ఇదా?

Varun G

AP Cabinet Meet: నేడు ఏపి కేబినెట్ భేటీ..! ఈ అంశాలపై కీలక చర్చ..?

somaraju sharma

మాజీ ఆప్కో చైర్మన్ నివాసంలో మళ్లీ సీఐడీ సోదాలు..!!

Special Bureau