Breaking News: చంపేసి.. ప్రమాదంగా చూపించాలనుకున్నారు.. కానీ..! సినిమాటిక్ క్రైమ్ సీన్ ఇది..!!

Breaking News: Murder Tried to Show as Accident
Share

Breaking News: సినిమాలను చూసి అలా చేయాలనుకున్నారో.. స్వతహాగా వచ్చిన ఐడియాని అమలు చేయాలనుకున్నారో.. కానీ ఓ అక్రమ జంట చేసిన దారుణ నేరం పోలీసులకు తెలిసి.. కటకటాల వెనక్కు వెళ్లేలా చేసింది..! ఓ వ్యక్తిని చంపేసి.., బైకుపై మధ్యలో పెట్టుకుని తీసుకెళ్లి.. ప్రమాదంగా చూపించాలనుకుని విఫలయత్నం చేసి చివరకు అడ్డంగా దిరికిపోయారు.. సినిమా తరహా క్రైమ్ సీన్స్ ఉన్న ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాలు ప్రకారం..!!

ప్రతి క్రైమ్ వెనుక డబ్బు లేదా వివాహేతర సంబంధం ఉంటుంది.. నూటికి తొంభై అయిదు శాతం నేరాలు ఈ రెండు కారణాలతోనే జరుగుతాయి.. ఇది కూడా అటువంటిదే.. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన మొద్దు వెంకటేష్‌ కి.., బుద్దారం గ్రామానికి చెందిన మాధవి అనే మహిళతో పదేళ్ల కిందట వివాహమైంది. ఈ ఇద్దరు మధ్య కొన్నాళ్ళు కాపురంబాగానే సాగింది. అయితే వెంకటేష్ పొలం పనులకు వెళ్లడం.., భార్య ఇంట్లో ఖాళీగా ఉండడంతో ఈమెకు పరాయి మగాడీపై వ్యామోహం పెరిగింది. నాగర్ కర్నూల్ కి చెందిన రమేష్ అనే యువకుడితో పేస్ బుక్ ద్వారా పరిచయమవ్వగా.., అతడితో కలిసి తిరిగి, షికార్లు చేసి ప్రేమాయణం నడిపి, చివరికి వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ళు గుట్టుగా సాగినప్పటికీ.. అలా అలా.., ఈ విషయం చివరకు భర్తకు తెలిసిపోయింది.

Breaking News: Murder Tried to Show as Accident
Breaking News: Murder Tried to Show as Accident

Breaking News: హత్యకు పన్నాగం.. అమలు..!

భర్త వెంకటేష్‌ తన భార్యను వివాహేతర సంబంధం గురించి నిలదీశాడు. ఇద్దరి మధ్య తరచు గొడవలు జరిగేవి. దీంతో వెంకటేష్ ని హతమార్చి, రమేష్ తో పూర్తిగా సెటిల్ అయిపోవాలని మాధవి ప్రణాళిక వేసింది. ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లి వచ్చిన భర్త ఆ రాత్రి ఎప్పటిలా భోజనం చేసి నిద్ర పోయాడు. అప్పుడు రమేష్ ఇంటికి వచ్చి.. మాధవితో కలిసి వెంకటేష్ పీక నులిమి హత్యా చేశారు. శవాన్ని ఏం చేయాలో తెలియక.. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి రోడ్డుపై నడిరాత్రి వేళ రోడ్డు ప్రమాదంగా చూపించాలి, అందరికీ నమ్మించాలి అనుకున్నారు… ప్లాన్ ప్రకారమే భర్త శవాన్ని మధ్యలో ఉంచుకొని బైక్‌పై ముగ్గురూ నాయినోని పల్లి శివారులో మెయిన్ రోడ్డుపై వేసి రోడ్డు ప్రమాదం చిత్రీకరించేందుకు ఆ రాత్రి వేలల్లోనే ప్రయత్నాలు చేశారు. సరిగ్గా అప్పుడే అటుగా వెళ్తున్న పోలీసులు ప్రధాన రహదారిపై ఈ అనుమానాస్పద వ్యక్తులను చూసి నిలదీశారు. కాసేపు తడబడి.. చవితికి భయంతో ఇద్దరూ మృతదేహాన్ని వదిలి పరారీకి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి, పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లి, వారి స్టైల్ లో స్థితి మర్యాదలు చేయడంతో మొత్తం నిజాలు చెప్పేసారు. వెంకటేష్‌. మాధవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఈ ఘటనపై వెంకటేష్‌ తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Share

Related posts

Chaavu Kaburu Challaga : “ఫిక్స్ అయిపో” అంటూ వచ్చేస్తోంది.. చావు కబురు చల్లగా..!!

bharani jella

ఒక్కరోజు… భారత్ సూపర్ రికార్డ్..!!

sekhar

ప్రకాశం జిల్లాలో దారుణం..! దర్శి ఆలయంలో మాంసపు ముద్దలు..!!

somaraju sharma