Breaking News: సీబీఐ కోర్టులో జగన్ కొత్త పిటిషన్.. ఆ కేసు నుండి పేరు తొలగించాలని…!!

AP Fiber Grid; YS Jagan Exams about TDP Corruption
Share

Breaking News: ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో ఓ కొత్త పిటిషన్ దాఖలు చేసారు. పెన్నా కేసులో ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు. ఈ కేసులో ఇప్పటికే సీఎం జగన్ సహా తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. తాజాగా సీఎం జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ తో కొత్త చర్చకు దారితీసింది. పెన్నా ఛార్జిషీట్ నుంచి పేరు తొలగించమని కోరుతూ సీబీఐ కోర్టులో బుధవారం మధ్యాహ్నం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ వేసారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి.. దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. ఆమె పిటిషన్ అలా ఉండగానే తాజాగా జగన్ కూడా దాఖలు చేయడంతో సీబీఐ కౌంటర్ ఏమిస్తుంది అనే చర్చ మొదలయింది. ఈ రోజు హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సబితా వేసిన పిటిషన్ పై సీబీఐ కౌంటర్ కి గడువు కోరింది. సరిగ్గా ఇదే సమయంలో జగన్ పిటిషన్ కూడా కోర్టుకి వెళ్లడంతో దీనిపై ఎటువంటి నిర్ణయం లేకుండానే కోర్టు వాయిదా పడింది. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరగా.., విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆమెతో పాటూ రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను ఈ నెల 22కు, ఇండియా సిమెంట్స్ కేసు విచారణను కోర్టు.. ఈనెల 28కి వాయిదా వేసింది. జగన్ పిటిషన్ పై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.


Share

Related posts

ప్రొఫెసర్ నాగేశ్వర్‎ను అందుకే చంపుతానన్నారా?

sekhar

Nagrjuna : నాగార్జున – ప్రవీణ్ సత్తార్ మూవీ రీ స్టార్ట్.. సంక్రాంతికి అందరిని టార్గెట్ చేయబోతున్న కింగ్

GRK

‘సినిమా చూసి చెప్పండి’

sarath