Breaking :యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో జోష్ మీద ఉన్నాడు. ‘చెక్’ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ‘రంగ్ దే’ చిత్రం ట్రైలర్ వదిలేశాడు. ఈ చిత్రం ఈనెల 26వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ చాయాగ్రాహకుడుగా పని చేశారు. హారిక హాసిని వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక.
సినిమా మొత్తం నితిన్, కీర్తి సురేష్ ల మధ్య కెమిస్ట్రీ, లవ్ స్టోరీ పైనే సాగుతుంది అని అర్థమవుతోంది. కమెడియన్స్ గా సుహాస్, గౌతమ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ కనిపించగా… నితిన్ తండ్రి గా నరేష్, కీర్తి సురేష్ తల్లి గా రోహిణి ప్రధాన పాత్రలు పోషించనున్నారు.
మొత్తానికి ఈ చిత్రం ట్రైలర్ చాలా హాస్యాస్పందంగా, ఇంట్రెస్టింగ్గా, ఎంటెర్టైనింగ్ గా ఉంది. మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం కోసం ఈ నెల 26 వరకు వెయిట్ చేయాల్సిందే.