ట్రెండింగ్ న్యూస్

Breaking : ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో అవుట్

Share

Breaking : హిందీలో ‘కౌన్ బనేగా కరోర్ పతి’ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోకి జాతీయ స్థాయిలో ఆదరణ దక్కింది. 

 

దీనిని తెలుగులో నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అని ‘మా టీవీ’ లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు చిరంజీవి కూడా హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఆ షో కే కొద్దిగా పేరు మార్చి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అని జూనియర్ ఎన్టీఆర్ జెమినీ టీవీలో చేయబోతున్నారు. 

దీనికి సంబంధించిన అప్డేట్ ముందే వచ్చింది. కొద్ది సేపటి క్రితమే ప్రోమో కూడా విడుదల అయ్యింది. త్వరలోనే రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. సామాన్యులకి ఈ షో లో చివరి దశ వరకు చేరుకుంటే ఏకంగా కోటి రూపాయలు లభిస్తాయి. 

మధ్యలో ఓడిపోయినా గెలిచిన దశ వరకు లక్ష రూపాయలకు పైగా గెలుపొందే అవకాశం కూడా ఉంది. మరి మీరూ త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి.


Share

Related posts

Mohan Babu: రాజకీయాలకు గుడ్ బైయే కానీ మోడీ పిలిస్తే..!!

somaraju sharma

హోదాపై మాట నిలబెట్టుకుంటాం: రాహుల్

sarath

Telangana: ఏపీ నుంచి తెలంగాణ‌కు వెళ్తున్నారా… ఈ విష‌యం తెలుసుకోండి మ‌రి

sridhar