BREAKING : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ తరఫున కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు ఆర్థిక సహాయం చేశారు. మొగులయ్యకు రెండు లక్షల రూపాయలు ప్రకటించి ఆర్థికంగా ఊరట కలిగించారు. కిన్నెర అనే సంగీత వాయిద్య పరికరం వాయించడంలో మొగులయ్యకు ఎవరు సాటిరారు. నల్లమల ప్రాంతానికి చెందిన మొగులయ్య పాటలు కూడా అద్భుతంగా పాడతారు.
Breaking: వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలకు రెడీ అయిన ఈసీ..!!
పవన్ కల్యాణ్ కూడా మొగులయ్య టాలెంట్ కు ఫిదా అయిపోయారు. అందుకే తన తదుపరి సినిమా ‘బీమ్లా నాయక్’లో టైటిల్ సాంగ్ ఆలపించే అవకాశం ఇచ్చారు. అయితే ఈ సంగీత కళాకారుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని కొద్దిరోజులుగా ఎన్నో హృదయవిదారక కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ మొగులయ్యకు ఆర్థికంగా చేయూత అందించి అందరి ప్రశంసలు దక్కించుకున్నారు.
BREAKING: వినాయకుడు సినిమా హీరో అరెస్ట్.. ?