NewsOrbit
న్యూస్

BREAKING: సుప్రీంకోర్టుకి ప్రకాష్‌రాజ్.. మోహన్‌బాబు బాగోతం బయటికి లాగుతున్నాడు..!?

BREAKING: ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ఎలక్షన్లను తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగి వారం రోజులు గడుస్తోంది. ఐతే 7 రోజులు గడుస్తున్నా.. మా వివాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ తన ఓటమిని అంగీకరించకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మంచు విష్ణు ప్యానల్ పై ఆయన చేస్తున్న ఆరోపణలు వాడీవేడీ చర్చలకు దారితీస్తున్నాయి. రాజీనామాలు చేయడం, సీసీటీవీ ఫుటేజ్ అప్పగించాలని మా ఎన్నికల అధికారికి లేఖ రాయడం వంటి విషయాలతో ఆయన వివాదాలు రేపుతున్నాడు. మా కాంట్రవర్సీ సద్దుమణిగిందనుకుంటే.. అది ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.


Maa Election’s: ప్రకాష్ రాజ్ కి ఊహించని షాక్ ఇచ్చిన “మా” ఎన్నికల అధికారి..!!
మా ఎన్నికల అధికారికి ప్రకాష్‌రాజ్ లేఖ

అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు తేల్చిన తర్వాత ప్రకాష్‌రాజ్ మా ఎలక్షన్ ఆఫీస‌ర్‌కు ఒక లేఖ రాస్తూ సీసీ టీవీ ఫుటేజ్‌ తనకి అప్పజెప్పాల్సిందిగా కోరాడు. మా ఎన్నికల్లో చాలా అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆయన ఆరోపించాడు. పోలింగ్ బూత్ లో మోహన్‌బాబు, నరేష్ ఇంకా తదితర మంచు విష్ణు మద్దతుదారులు తమపై దౌర్జన్యాలకు దిగారని.. తమకు ఓట్లు వేయాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని బెదిరించారని ప్రకాష్‌రాజ్ తన లేఖలో పేర్కొన్నాడు. వారి గుండాయిజానికి సంబంధించిన తతంగమంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయినట్లు.. అందుకే ఆ ఫుటేజ్‌ తమకు ఇవ్వాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ‌మోహ‌న్‌కు ప్రకాష్ లేఖ రాశాడు.


Bigg Boss 5 Telugu: షణు అంటే అందుకే భయం…. ఎవరు టచ్ చేయరు శ్వేతా సంచలన కామెంట్స్..??
ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందన

తెలంగాణ హైకోర్టు లాయర్ కృష్ణమోహన్ ప్రకాష్‌రాజ్ చేసిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించలేదు. ఎన్నికల అధికారిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం మాత్రమే తన పని అని.. మిగతా విషయాలు తన చేతుల్లో ఉండవని అతడు కుండబద్దలు కొట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని.. స్వయంగా తనకు తాను పుటేజ్ ఇవ్వడం అసాధ్యమని వెల్లడించారు. కోర్టు నిబంధనల ప్రకారం ఫుటేజ్ సమర్పించాలా లేక ఇంకేదైనా లీగల్ విధానాన్ని అనుసరించాలి? అనేది తెలియాలంటే ఇంకొంత సమయం పడుతుందని కృష్ణమోహన్ చెప్పడంతో ప్రకాష్‌రాజ్ ఆశలు అడియాశలయ్యాయి.


MAA Elections: మా ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్..! నిన్న నాగబాబు..నేడు ప్రకాశ్ రాజ్..! రేపు ఎవరో..?
సీసీటీవీ పుటేజ్ సీజ్ చేసిన హైదరాబాద్ పోలీస్

సీసీ టీవీ పుటేజ్ వ్యవహారం తెరమీదకు వచ్చిన నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జూబ్లీహిల్స్ స్కూల్లో భద్రపరిచిన సీసీ టీవీ పుటేజ్ ని తాజాగా పోలీసులు సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫుటేజ్ పరిశీలించి దాడులు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విజువల్స్ ఎవరు కూడా అన్యాయంగా ఉపయోగించుకుని లబ్ది పొందేందుకు వీల్లేకుండా దాన్ని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. దాంతో ప్రకాష్ ప్యానెల్‌కు భారీ షాక్ తగిలినట్లయింది.

MAA Elections: ఈ విషయంలో కేసిఆర్ సర్కార్ యమ గ్రేటో..! వాళ్లు థ్యాంక్స్ చెప్పాల్సిందే..!!?

సుప్రీంకోర్టుకి ప్రకాష్‌రాజ్

సీసీ టీవీ ఫుటేజ్ పై ప్రకాష్‌రాజ్ ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. కానీ అటు ఎన్నికల అధికారి.. ఇటు పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ని అందని ద్రాక్షలా మార్చడంతో ప్రకాష్‌రాజ్ తలపట్టుకుంటున్నాడు. ఈ వ్యవహారం తాడోపేడో తేల్చేందుకు.. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టులకు కూడా వెళ్లేందుకు ప్రకాష్‌రాజ్ సిద్ధమయ్యాడని తెలుస్తోంది. మంచు విష్ణు, మోహన్ బాబు ఎన్నికల కేంద్రంలో చేసిన బాగోతం బట్టబయలు చేయాలని అతడు చాలా సీరియస్‌గా నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అయితే కనీసం న్యాయస్థానమైనా నిబంధనల ప్రకారం తనకు సీసీ టీవీ పుటేజ్ ఇస్తుందని ప్రకాష్ ఆశిస్తున్నాడని సమాచారం. మరి ఈ విషయం ఎటు తేలుతుందో చూడాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju