BREAKING: రామ్ చరణ్, శంకర్ కాంబోలో రానున్న అప్ కమింగ్ సినిమా షూటింగ్ బుధవారం ఉదయం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్ర బృందం వైట్ టీ షర్ట్ లతో ఒక ఫొటో షూట్ కూడా చేసింది. టెస్ట్ షూట్ కూడా జరిగినట్లు స్పెషల్ మాధ్యమాల్లో ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మూవీ టైటిల్ గురించి ఆసక్తికర టాక్ నడుస్తోంది. అదేంటంటే, ఈ పాన్ ఇండియా సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ను ఫిక్స్ చేయాలని శంకర్ భావిస్తున్నారట. విశ్వంభర అంటే ధరిత్రి, భూమి, నేల అని అర్థం. ఒకవేళ ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే.. అదిరిపోతుందని చెప్పుకోవచ్చు.
BREAKING: హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్ కల్యాణ్..!
ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనున్న 50వ చిత్రం కానుంది. అంతేకాదు, రామ్ చరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా కాబోతోంది. ఎస్.ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీత బాణీలు సమకూర్చనున్నారు. ఈ మూవీ 2023లో విడుదల కానుందని తెలుస్తోంది.
COSTLY COTTAGE: అయ్య బాబోయ్: ఆ కాటేజ్ కోసం అన్ని కోట్లా.. స్పెషల్ ఏంటి..?!