Breaking: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు భారీ యాక్సిడెంట్ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కాన్వాయ్ లోని ఆరు కార్లు ఒకదాని వెనుక ఢీకొట్టుకున్నాయి. అయితే బెలూన్లు ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆరు కార్లు ముందు వెనుక దెబ్బతిన్నాయి. పలువురు జర్నలిస్ట్ లకు స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంత్రి కేటిఆర్ ఇలాక సిరిసిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర 20వ రోజుకు జరుగుతోంది. పాదయాత్రలో భాగంగా నేడు క్యాంపు వద్ద పవర్ లూమ్ వర్కర్స్, ఆసాముల సంఘం, జఫర్ సంఘాలతో రేవంత్ సమావేశం జరగనున్నది.