Subscribe for notification
Categories: న్యూస్

Breaking: పంజాబ్ పీసీపీ మాజీ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్టు

Share

Breaking: దాదాపు 30ఏళ్ల క్రితం నాటి కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 1988 డిసెంబర్ 27న పాటియాలాలోని షెరన్‌వాలా గేటు క్రాసింగ్ వద్ద సిద్దూకు, గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. ఆ ఘర్షణలో గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్దు నేరస్తుడు అనడానికి తగిన ఆధారాలు ఏమీ లేవన్న కారణంతో 2018 మే నెలలో సుప్రీం కోర్టు ఆయనను నిర్ధోషిగా పేర్కొంది. కేవలం వెయ్యి రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం. మరో సారి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం ధర్మాసనం మరో సారి సిద్ధూ కేసును విచారణ జరిపింది. ఈ కేసులో ఆయనను నేరస్థుడిగా పరిగణించిన సుప్రీం కోర్టు .. ఏడాది జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Breaking: Supreme court sentenced Congress leader Navjot Singh Sidhu

Breaking: మూడు దశాబ్దాల తరువాత

కేసు పూర్వాపరాలు ఏమిటంటే.. 1988 డిసెంబర్ 27న పాటియాలాలోని షెరన్‌వాలా గేట్ క్రాసింగ్ సిద్దూ తన జిప్సీని పార్క్ చేసి స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లిన గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడు రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న జిప్సీని పక్కకు తీయాలని సిద్ధూను కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ ఘర్షణలో గాయాలపాలైన గుర్నామ్ సింగ్ తరువాత ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై బాధితుడి బంధువులు ఫిర్యాదుతో సిద్దు, అతని స్నేహితుడు నంధూపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన ట్రయిల్ కోర్టు 1999 సెప్టెంబర్ నెలలో సిద్ధూను, అతని స్నేహితుడు నంధూను నిర్ధోషులుగా తీర్పు ఇచ్చింది. ట్రయిల్ కోర్టును బాధితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు ట్రయిల్ కోర్టు తీర్పును పక్కకు పెట్టింది.

తొలుత వెయి రూపాయలు జరిమానా… ఇప్పుడు ఏడాది జైలు

దీనిపై సిద్ధూ అతని స్నేహితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2007లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. సిద్దుకు సెక్షన్ 323 కింద వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సిద్ధుకు కేవలం వెయ్యి రూపాయల జరిమామా మాత్రమే విధిస్తూ తీర్పు రావడంపై బాధిత కుటుంబం అభ్యంతరం తెలియజేస్తూ సుప్రీం కోర్టు లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, ఎస్‌కే కౌలు నేతృత్వంలోని ధర్మాసనం..వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.


Share
somaraju sharma

Recent Posts

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

43 mins ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

3 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

5 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

6 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

8 hours ago

Upasana: పిల్లల విషయంలో రామ్ చరణ్ భార్య వేసిన ప్రశ్నకు సద్గురు సంచలన సమాధానం..!!

Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

8 hours ago