ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: కర్నూలు జిల్లా హోలగుందలో ఉద్రిక్తత

Share

Breaking: కర్నూలు జిల్లా హోలగుందలో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీస్ స్టేషన్ ముందే ఈ రోజు ఇరువర్గాలు మోహరించాయి. అక్కడే ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కర్నూలు ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదనపు పోలీసుల బలగాలతో హోలగుందలో బందోబస్తు చర్యలు చేపట్టారు.

Breaking tension in Holagunda Kurnool district
Breaking tension in Holagunda Kurnool district

నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందకు చేరుకుని శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణపై ఆరా తీశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కొనసాగిస్తున్నారు.


Share

Related posts

‘కోడి కత్తి’అంటే బాబుకు భయం : కన్నా

Siva Prasad

India Today Survey: వైసీపీ అభిమానులకు షాకింగ్..! ప్రజల్లో విస్మయం..!!

somaraju sharma

Harish Rao: పుట్టిన‌రోజున హ‌రీశ్ రావు సంచ‌ల‌న నిర్ణ‌యం… వైర‌ల్ అవుతున్న ప్ర‌క‌ట‌న‌

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar