Breaking: ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర సీఎం పదవికి బీజేపీ నేత బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ కు శనివారం సాయంత్రం అందజేశారు. 2018లో త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టిన బిప్లవ్ కుమార్ దేవ్..గడచిన నాలుగేళ్ల పాటు ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండానే నడిపారు అన్న పేరు ఉంది. అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు వెల్లడించలేదు కానీ ఉన్నంటుండి సీఎం పదవికి రాజీనామా చేశారు. నూతన సీఎం ను ఎన్నుకునేందుకు నేటి రాత్రి 8గంటలకు లేజిస్లేచర్ పార్టీ కీలక సమావేశం కానుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకే సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Breaking: నిన్న ఢిల్లీ పర్యటన – నేడు రాజీనామా
సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ కేంద్ర పెద్దలను కలిశారు. నేడు ఢిల్లీ నుండి త్రిపుర రాజధాని అగర్తలాకు తిరిగి వచ్చిన వెంటనే కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే రాజ్ భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించారు బిప్లవ్ కుమార్ దేవ్. వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర అధిష్టానం కీలక మార్పునకు సూచించడంతో సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ తప్పుకున్నట్లు సమాచారం. కాగా సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేసిన నేపథ్యంలో నూతన సీఎం ఎంపికకు ఈ రాత్రి 8 గంటలకు పార్టీ ఎల్పీ మీటింగ్ జరుగుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ సెంట్రల్ అబ్జర్వర్ భూపేందర్ యాదవ్ తెలిపారు.