Breaking : ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ మళ్లీ యాక్టింగ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయింది. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ బాణీలు సమకూర్చారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో ప్రకాష్రాజ్, అంజలి, నివేదాథామస్, అనన్య నాగళ్ళ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ ను రెండు నిమిషాల 9 సెకన్లలో కట్ చేశారు.
పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించిన ఈ సినిమా లో ముగ్గురు అమ్మాయి కి జరిగిన అన్యాయం పై వారి పక్క నిలుస్తాడు. ఇదే క్రమంలో సొసైటీకి ఉన్న అమ్మాయిల పైన ఉన్న చెడు దృష్టిని కూడా ప్రశ్నిస్తాడు.
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘పింక్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే అనిపిస్తుంది. అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ద్వార పవన్ కళ్యాన్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ చూడవచ్చు.