NewsOrbit
న్యూస్

తెలంగాణ ఇంటెలిజెన్స్ కు ఊపిరి సలపనంత పని!ఎందుకంటే ఇందుకు!!

దుబ్బాక బై ఎలక్షన్స్​లో గెలిచిన బీజేపీ, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకోవడంతో అధికార టీఆర్​ఎస్​ పార్టీకి వలసల భయం పట్టుకున్నది. టీఆర్​ఎస్​ లీడర్లు బీజేపీలోకి జంప్​ అయ్యే చాన్స్​ ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వ పెద్దలు జిల్లాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న మూడు ప్రాంతాలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జునసాగర్​ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భంగపడ్డ రూలింగ్​ పార్టీ ఆ మూడుచోట్ల నుంచి స్పెషల్​ రిపోర్టులు తెప్పించుకుంటోంది. ఇంటెలిజెన్స్​తో పాటు థర్డ్​పార్టీ తో ఎంక్వైరీ చేయిస్తోంది. టీఆర్​ఎస్​తో పాటు బీజేపీ, ఇతర పార్టీల బలాబలాలు, రెండు బల్దియాల పరిధిలో సిట్టింగులపై ఉన్న వ్యతిరేకత గురించి ఆరా తీస్తోంది. స్టేట్​వైడ్​గా ఏయే లీడర్లు కాషాయ పార్టీలోకి వెళ్లే చాన్స్​ ఉందో వివరాలు సేకరించి రిపోర్ట్​ పంపుతున్నట్లు పోలీస్​వర్గాల్లో చర్చ నడుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా శనివారమే రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్​ వర్గాలు టీఆర్ఎస్ లీడర్ల​ గురించి ఆరా తీస్తున్నారు. గ్రామ సర్పంచ్​ మొదలుకొని మంత్రుల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. రాజకీయంగా ప్రస్తుత పరిస్థితి, ఇప్పుడున్న పార్టీపై ఏ తరహా అసంతృప్తి ఉంది? పార్టీ మారడానికి ఇతరత్రా ఏయేఅంశాలు కారణమవుతున్నాయో తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఆయా లీడర్లకు బీజేపీ నేతలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వాళ్ల అనుచర గణం ఏస్థాయిలో ఉంది?​ ఎంత మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగే చాన్స్​ఉందో ప్రత్యేకంగా కనుక్కొంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సెకండ్​ కేడర్​ లీడర్లు, వివిధ సంఘాల నాయకుల నుంచి డాటా సేకరిస్తున్నారు.

పై నుంచి వచ్చిన ఆదేశాలమేరకు ఇంటెలిజెన్స్​వర్గాలు ప్రధానంగా టీఆర్​ఎస్​ లీడర్లపైనే ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా వివిధ టికెట్లు ఆశించి భంగపడినవారు, కాంగ్రెస్​ నుంచి ఎమ్మెల్యేలు వలస వచ్చిన చోట వాళ్లతో అంటీముట్టనట్లు ఉంటున్న టీఆర్​ఎస్​ లీడర్లు బీజేపీలోకి వెళ్లే చాన్స్​ ఉందని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. దీంతో ఒక వర్గం నేతలకు తెలియకుండా మరో వర్గం నేతలను ఆరా తీస్తున్నారు. ప్రధానంగా సెకండ్​క్యాడర్​ చెప్పే విషయాలను ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకొని నివేదికల్లో పొందుపరుస్తున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే బిజెపి అంటే అధికార టీఆర్ఎస్లో ఉలికిపాటు కన్పిస్తోంది.

 

author avatar
Yandamuri

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju