Bro daddy : కొన్ని కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ హిట్ సాధిస్తుంటాయి. ఆ సినిమాలను వెంటనే మరో భాషలోకి రీమేక్ చేయడం కూడా చక చకా జరిగిపోతాయి. భారీ ఆఫర్ తో రైట్స్ దక్కించుకొని భారీ తారాగణంతో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతుంటాయి. అలా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా లూసీఫర్. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో హీరోగా నటించారు. అక్కడ ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాను హీరో, డైరెక్టర్ పృథ్వి రాజ్ సుకుమారన్ తెరకెక్కించాడు.
ఈ కాంబోకి లూసిఫర్ భారీ హిట్ ఇచ్చి క్రేజీ కాంబినేషన్ గా నిలిపింది. అయితే ఈ కాంబోలో మళ్ళీ ఇంత త్వరగా సినిమా వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. కానీ అందరికి సూపర్ సర్ప్రైజ్ ఇస్తూ కొత్త ప్రాజెక్ట్ ను తాజాగా ప్రకటించారు. మరోసారి ఈ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న లేటెస్ట్ సినిమాకి బ్రో డాడీ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. లూసీఫర్ లా సీరియస్ సినిమా కాకుండా ఈసారి కంప్లీట్ ఫన్ అండ్ ఎంటర్టైనమెంట్ ఉండే సినిమాతో రాబోతున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు, నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ వెల్లడించాడు.
Bro daddy : బ్రో డాడీ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారట.
అయ్యప్పనుం కోషియం లాంటి సినిమాలలో ఒక హీరోగా నటిస్తూనే లూసీఫర్ లాంటి సినిమాలను తీస్తూ తన రేంజ్ ను అంతకంతా పెంచుకుంటున్నాడు పృథ్వి రాజ్ సుకుమారన్. ఇక బ్రో డాడీ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారట. ఆశిర్వాద్ సినిమాస్ అనే బ్యానర్ లో యాంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించగానే అంచనాలు భారీగా మొదలయ్యాయి. ఇక లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించబోతున్నాడు. వచ్చే నెలనుంచి షూటింగ్ స్టార్ చేయనున్నారట.