(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావగారు, ప్రముఖ సువార్తకుడు బ్రదర్ అనిల్‌కుమార్‌కు కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్దకు రాగానే అదుపు తప్పి ఫుట్ పాత్ నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బ్రదర్ అనిల్‌తో పాటు ఆయన డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి బ్రదర్ అనిల్‌తో పాటు ఆయన డ్రైవర్, గన్‌మన్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ తన పర్యటనకు వెళ్లిపోయారు.