NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS Vs BJP: బలవంతంగా కేసిఆర్ వద్దకు తీసుకువెళ్లినా..’ఆరూరి’ని ఆపుకోలేకపోయిన బీఆర్ఎస్ .. హనుమకొండ నుండి హస్తిన మారిన సీన్ ..బీఆర్ఎస్ కట్టడి వ్యూహాన్ని బ్రేక్ చేసిన బీజేపీ   

BRS Vs BJP: వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను ఆ పార్టీ నేతలు బలవంతంగా నిన్న కేసిఆర్ వద్దకు తీసుకువెళ్లినా పార్టీ వీడకుండా ఆపలేకపోయారు. ఆయన పార్టీ వీడే కార్యక్రమం హనుమకొండ నుండి హస్తినకు మారింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ లోని పలువురు బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని బీజేపీ లోక్ సభ టికెట్ లు ఖరారు చేస్తున్నది.

ఈ క్రమంలో బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న ఆరూరు రమేష్ ను పార్టీలో చేర్చుకుని వరంగల్ లోక్ సభ అభ్యర్ధిగా ప్రకటించాలని బీజేపీ నేతలు భావించారు. బీజేపీ నేతల మంతనాలతో బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్దమైయ్యారు ఆరూరి రమేష్. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే ఆలోచనలో ఆరూరి రమేష్ ఉన్నారని తెలియడంతో ఇటీవల బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెండ్, మాజీ మంత్రి కేటిఆర్ తొలుత ఆయనను తెలంగాణ భవన్ కు పిలిపి బుజ్జగించారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడిన ఆరూరి తాను బీఆర్ఎస్ ను వీడటం లేదని నాలుగు రోజుల క్రితం ప్రకటించారు.

అయితే ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ మళ్లీ మనసు మార్చుకున్నారు. మంగళవారం బీజేపీ అగ్రనేత అమిత్ షాతోను కలిసే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ చేరాలని నిర్ణయించుకున్నట్లు బహిర్గతమైంది. ఈ క్రమంలో నిన్న (బుధవారం) ఉదయం హనుమకొండలో మీడియా సమావేశం పెట్టి బీఆర్ఎస్ కు రాజీనామా విషయాన్ని చెప్పాలని ఆరూరి రమేష్ సిద్దమయ్యారు. ఈ విషయం తెలియడంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య తో పాటు మరి కొందరు బీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకుని మీడియా సమావేశం క్యాన్సిల్ చేసుకోవాలని సూచించారు.

అందుకు ఆయన  ససేమిరా అంటూ మీడియా సమావేశానికి సిద్దమవుతుండగా, ఆయనను కొద్దిగా బలవంతంగా ఎర్రబల్లి దయాకర్ రావు బయటకు తీసుకువచ్చి కారులో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకువెళ్లారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇంటికి తీసుకువెళ్లారు. కేసిఆర్ తో సమావేశం అనంతరం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అమిత్ షాను కలవలేదని తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు.

దీంతో ఆరూరి రమేష్ మెత్తబడ్డారు అందరూ అనుకున్నారు. అయితే వరంగల్లు లోక్ సభ స్థానం నుండి తాను పోటీ చేయనని కేసిఆర్ కు రమేష్ చెప్పినట్లుగా తెలుస్తొంది. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి కుమార్తె ను వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా పార్టీ అనౌన్స్ చేసింది. అయితే తెల్లారి పాటికి మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. తెలంగాణ బీజేపీ నేతలు పలువురు ఆరూరి రమేష్ ను వెంట బెట్టుకుని ఢిల్లీ (హస్తిన)కి తీసుకువెళ్లారు. ఈ రోజు అమిత్ షాతో భేటీ అయిన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు రమేష్.

రమేష్ పార్టీలో చేరిన తర్వాత వరంగల్ లోక్ సభ అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 17 లోక్ సభ స్థానాలకు 15 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్ లో పెట్టింది. రమేష్ కోసమే వరంగల్ లోక్ స్థానం పెండింగ్ లో ఉంచినట్లు సమాచారం. ఆరూరి రమేష్ వ్యవహారాన్ని హనుమకొండ నుండి హస్తిన మార్చడంతో బీఆర్ఎస్ కట్టడి వ్యూహానికి బీజేపీ బ్రేక్ చేసినట్లు అయ్యింది.

EC: నేడు ఎన్నికల కమిషనర్ల నియామకంపై సమావేశం .. రేపు సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N