31.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLC Kavitha: 15 న వస్తానంటే కుదరదన్నారు ..11న అయితే ఒకే అన్నారు .. కేంద్రంలోని బీజేపీపై కవిత  సీరియస్ కామెంట్స్

Share

MLC Kavitha:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో  మహిళా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారమే కవిత ఢిల్లీకి చేరుకున్నారు. 11వ తేదీన ఈడీ ముందు కవిత విచారణకు హజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లుడుతూ మోడీ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్  విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ జరిపినా తనకు ఇబ్బంది లేదని అన్నారు. విచారణకు హజరయ్యేందుకు తనకేమి భయంలేదన్నారు. విచారణ సంస్థలకు సహకరిస్తాననీ, అధికారులు అడిగే ప్రశ్నలు అన్నింటికీ జవాబిస్తానని వివరించారు.

mlc kavitha

 

తన తండ్రి, సోదరుడితో పాటు పార్టీ మొత్తం తనకు అండగా ఉంటుందన్నారు కవిత. 9వ తేదీన విచారణ రావాలంటూ ఈడీ నుండి తనకు నోటీసులు అందాయనీ, అయితే ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని ఈ నెల 2వ తేదీనే నిర్ణయించామనీ, ఆ కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షించాల్సి ఉండటంతో కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ నెల 15న విచారణకు హజరవుతానని చెప్పినా ఈడీ అధికారులు అంగీకరించలేదని చెప్పారు. దీంతో ఈ నెల 11న విచారణకు వస్తానని చెప్పినట్లు కవిత తెలిపారు. ఈడీ విచారణకు రెండు రోజుల సమయం ఇస్తే వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని కోరినా అంగీకరించలేదన్నారు. మహిళలను ఇంట్లో విచారించాలని చట్టం చెబుతోందన్నారు.

ఇది తన ఒక్కరి సమస్య కాదనీ అన్నారు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరస్తామని తెలిపారు. దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతామన్నారు. ఉద్యమం చేసి వచ్చామనీ, భయపడే వాళ్లం కాదనీ, ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరని ప్రశ్నించారు.  దాదాపు 200 మంది ఇళ్లపై ఈడీ దాడులు చేసిందన్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన నేతల ఇళ్లల్లో కూడా దాడులు జరిగాయన్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు. దేశంలో మోడీ – ఆదానీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తొందని విమర్శించారు. మోడీకి ఆదానీ బీనామీ అని పిల్లోడిని అడిగినా చెబుతారన్నారు. తెలంగాణ నేతలను వేధించడం కేంద్రానికి అలవాటై పోయిందని మండిపడ్డారు.

మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రం ఈడీ దాడులు చేస్తొందని అన్నారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తొందని అన్నారు. గాంధీ పుట్టిన దేశంలో అబద్దం రాజ్యమేలుతోందనీ, ప్రధాని మోడీ బయటే కాదు పార్లమెంట్ లోనూ అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. తాము బీజేపీకి బీ టీమ్ అయితే ఈడీ ఆఫీసుకు ఎందుకు వెళ్తున్నామని ప్రశ్నించారు. తనతో పాటు ఎవరిని విచారించినా తనకు ఇబ్బంది ఏమీ లేదన్నారు. వాళ్లకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీట్ ముందు బీఎల్ సంతోష్ ను హజరుకావాలని చెప్పాలన్నారు. దేశం లో మోడీ వన్ నేషన్ – వన్ ఫ్రెండ్ స్కీమ్ తెచ్చారని సెటైర్ వేశారు. విపక్షాలను టార్గెట్ చేయడం  పని గా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం అధిక ధరలు, నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బీజేపీ చేరగానే క్లీన్ చిట్ ఇస్తున్నారన్నారు.

1996 నుండి మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లోనే ఉందనీ, కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దానికి మోక్షం కలగడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో తగిన మెజార్టీ ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని మోడీ మర్చిపోయారని ఆరోపించారు కవిత. 2018 లో కూడా మరో సారి ఈ బిల్లు పాస్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని కవిత విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ సమయం ఉందనీ, మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికైనా పాస్ చేయాలని కవిత కోరారు. ఈ విషయంలో కల్పించుకోవాలని, బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు చొరవ చూపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కవిత విజ్ఞప్తి చేశారు.

Fire Accident: షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం.. వంద మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది


Share

Related posts

అగ్నికి ఆహుతి అవుతున్న వరంగల్ అడవులు మంటల్లో జంతువులు

venkat mahesh

సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ లను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి .. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

somaraju sharma

Minister Jayaram : మరో వివాదంలో మంత్రి గుమ్మనూరు జయరాం

somaraju sharma