Brushing: పళ్ళు తోమేటప్పుడు చేసే తప్పులు ఇవే..!!

Share

Brushing: ప్రతినిత్యం బ్రష్ చేసుకునే అలవాటు అందరికీ ఉంటుంది.. కొంతమంది రోజుకి రెండుసార్లు.. మరికొంతమంది ఇంకా ఎక్కువ సార్లు చేస్తూ ఉంటారు.. పళ్ళు ఎక్కువ సార్లు తోమటం మంచిదేనా..!? అసలు రోజుకి ఎన్ని సార్లు కడగాలి.. బ్రష్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏంటి..!? వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

పళ్ళు తోమేటప్పుడు ఎక్కువ సేపు తోముతు ఉంటారు. కొందరైతే స్పీడ్ గా బ్రష్ చేస్తూ ఉంటారు.. ఈ రెండు మంచివి కాదు.. ఎక్కువ సేపు తోమద్దు.. అలాగని వేగంగా రుదద్దు.. అలాగే తప్పకుండా రోజుకి రెండుసార్లు బ్రష్ చేయటం అలవాటు చేసుకోవాలి.. అంతకంటే ఎక్కువ సార్లు తోమితే పంటిపై ఉండే ఎనామిల్ తొలగిపోతుంది.. అంతేకాకుండా పంటి సమస్యలు కూడా వస్తాయి.. పంటి సమస్యలు ఎక్కువగా ఉంటే డెంటిస్ట్ ని‌ కలవడం మంచిది.

పళ్ళని తోమేటప్పుడు వెర్టికల్ గా చేయాలి. హరిజోంటల్ గా అస్సలు బ్రష్ చేయకూడదు. దీనివల్ల ఇరిటేషన్, పాడయ్యే సమస్యలు వస్తాయి. అలాగే పళ్ళు తోమేటప్పుడు బ్రష్ 45 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా పై నుంచి కిందకి జరుపుతూ స్ట్రోక్స్ ఇవ్వద్దు. ఇలా చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే మీ పళ్ళు ఆరోగ్యం గా ఉంటాయి.. అంతేకాకుండా క్రిములు కూడా తొలగిపోతాయి.. ఆటోమేటిక్ బ్రష్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా పళ్లను శుభ్రంగా ఉంచుతాయి. ఆహారం తిన్నాక పళ్ళని నీళ్లతో కడుక్కోవాలి. ఒకవేళ ఎలాంటి పంటి సమస్య ఉన్న డెంటిస్ట్ ని కలవండి.


Share

Related posts

ఇంటికి చేరిన అమిత్ షా

Siva Prasad

జగన్ ఎఫెక్ట్ ఏపీలో బీసీ వర్గాలలో మార్పు..!!

sekhar

ఎన్నికల్లో డబ్బు పంపిణి తీవ్ర నేరం

somaraju sharma