NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

AP SSC Results: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలు విడుదల చేశారు. మార్చి 18 నుండి 30వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

మొత్తం 6.23 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హజరైయ్యారు. ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 84.32 శాతం పాసయ్యారు. రాష్ట్రంలో 2,803 పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా, 17 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత నమోదైంది.

96.37 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా, 62.47 శాతంతో కర్నూలు జిల్లా చివరి స్థానం దక్కించుకుంది. ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 96.72 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88శాతం, సాంఘీక సంక్షేమ పాఠశాలల్లో 94.56 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 90.13 శాతం, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 98.96 శాతం, ట్రైబల్ వెల్పేర్ పాఠశాలల్లో 89.64 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 79.38 శాతం, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 80.01 శాతం, మున్సిపల్ హైస్కూళ్లలో 75.42 శాతం విద్యార్ధులు, ప్రభుత్వ పాఠశాల్లో 74.40 శాతం విద్యార్ధులు పాసయ్యారు.

మే 24 నుండి జూన్ 3వరకూ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుండి ఆన్ లైన్ లోనే రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. నాలుగు రోజుల్ల అధికారక వెబ్ సైట్ నుండి మెమోలు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ఫలితాల కొరకు Https://www.vsc.apap.gov.in/  క్లిక్ చేయండి

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?