NewsOrbit
న్యూస్

Budget 2022: రొయ్య, చేపల ఫీడ్ పై దిగుమతి సుంకం తగ్గించాలంటూ కేంద్రమంత్రికి లేఖ..!!

Budget 2022: Shrimp Fish Farmers Letter

Budget 2022: ఓ వైపు కరోనా మహమ్మారి కష్టాలు.. మరోవైపు విదేశాల నుండి తీవ్ర పోటీ.., మరోవైపు కేంద్రం కూడా దిగుమతి సుంకం పెంచిన కారణంగా దేశంలోని రొయ్య ఉత్పత్తిదారులు నష్టపోతున్నట్టు ఆ సంఘం పేర్కొంది. తమ ఇబ్బందులు, అందుకు గల కారణాలు పేర్కొంటూ.. వచ్చే బడ్జెట్ లో తమకు సహకారం అందించాలని కోరుతూ ఆ సంఘం తరపున అధ్యక్షులు మోహన్ రాజు నేతృత్వంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కి లేఖ రాశారు. రొయ్యలు, చేపల ఫీడ్ పై 2021 బడ్జెట్ కి ముందు 5 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని.. 2021లో 15 శాతంగా పెంచారని.. తద్వారా ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని.. కేంద్రం తక్షణమే స్పందించి దాన్ని మళ్ళీ 5 శాతానికి తగ్గించాలని కోరుతూ లేఖని విడుదల చేశారు.. ఈ లేఖలో ఇంకా ఏమున్నాయంటే..!

Budget 2022: Shrimp Fish Farmers Letter
Budget 2022 Shrimp Fish Farmers Letter

* దేశంలోని రొయ్య ఉత్పత్తిదారులు వరుసగా ఆరేళ్లపాటు మన దేశాన్ని రొయ్య ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా నిలిపారు. కానీ.. విదేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి వ్యవమ్ పెరగడం, ఫీడ్ ధర కూడా పెరగడంతో కొన్ని నెలలుగా వరుసగా నష్టాలు వస్తున్నాయి. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలను దాదాపు 90 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.., కానీ విదేశాల నుండి నాణ్యమైన ఫీడ్ మాత్రం సరైన ధరకు రావడం లేదు.

* కరోనా మహమ్మారి కారణంగా ఫీడ్ ధర 35 శాతం పెరిగింది. 5 శాతం నుండి 15 శాతానికి దిగుమతి సుంకం పెంచిన కారణంగా ఉత్పత్తిదారులకు మరింత ఆర్థికభారం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మన దేశమే రోయ్య్య, చేపల ఫీడ్ వినియోగంలో అగ్రగామిగా ఉంది. కానీ ఇప్పుడు ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ ధర ఉంది. గతంలో రూ. 500 కోట్లు ఉండే నికర ఆదాయం ఈ ఏడాది రూ. 305 కోట్లకు పడిపోయింది. దిగుమతి సుంకం పెంచక ముందు ఏటా 60 వేల టన్నుల ఫీడ్ దిగుమతి చేసేవారు. కానీ 3.5 శాతం మాత్రమే దేశీయంగా వినియోగించేవారు. కేంద్రం ఈ అంశాలపై స్పందించి.. ఈ ఏడాది బడ్జెట్ లో దిగుమతి సుంకం విషయంలో పునరాలోచించాలని కోరారు..!

 

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!