నేటి నుంచి క్రేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో ఇది చివరి బడ్జెట్ సమావేశం కావడంతో దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కుప్పకూలింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్టా బడ్జెట్.. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలా? లేదా ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ రూపొందించాలా? అనే అంశాలు ప్రస్తుతం కేంద్రం ముందు పెద్ద సవాల్‌గా మారాయి. ఎటు వైపు ఎక్కువ మొగ్గినా.. రెండో దానిపై ప్రభావం భారీగానే చూపుతుంది. ప్రస్తుతం దేశ ప్రజల చూపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పైనే ఉన్నాయి. ఆమె ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.

కేంద్ర బడ్జెట్ 2023-24కు సంబంధించి పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆయా రంగాలకు బడ్జెట్ కేటాయింపులు, తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే మీడియా, వినోదరంగంపై బడ్జెట్‌లో కొన్ని సవరణలు జరిగేలా కనిపిస్తున్నాయని సమాచారం. ఇటీవల నివేదికల ప్రకారం.. కరోనా మహమ్మారి సమయంలో మీడియా, సినీ రంగంపై భారీ నష్టాన్ని ఎదుర్కొన్నాయి. దాంతో చాలా వరకు సినిమాలు, ఓటీటీల్లో భారీగా ధరలు పెంచేశారు. అయితే ఈ బడ్జెట్‌లో సినిమాలతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై టికెట్ ధరలు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సినీ సభ్యులు కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది.

ఒక వేళ కేంద్రం వీరి అభ్యర్థనను ఆమోదించినట్లయితే మల్టీఫ్లెక్స్, ఓటీటీలల్లో టికెట్ల ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలా జరిగితే సామన్యులు కూడా మల్టీఫ్లెక్స్ లలో సినిమాలు చూడవచ్చు. 2021 డేటా ప్రకారం.. భారతదేశంలోని మీడియా, సినీ పరిశ్రమల విలువ 1.6 ట్రిలియన్లకు పైగా ఉంది. టెలివిజన్ అత్యధిక వాటాను కలిగి ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో డిజిటల్, ప్రింట్ మీడియాలు ఉన్నాయి. అలాగే సినీ రంగాలపై కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. ఒక వేళ సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే.. ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల సబ్‌స్క్రిఫ్షన్ రేటును కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

ప్రముఖ నిర్మాత చలనచిత్ర వ్యాపార నిపుణుడు గిరీష్ జోహార్ మాట్లాడుతూ.. ‘మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్‌ల టికెట్ ధరల మధ్య వ్యత్యాసం వల్ల యజమాలు భారీగా నష్టపోతున్నారు. టికెట్ ధరలను స్టేట్ బడ్జెట్ నిర్ణయిస్తుంది. అయితే దక్షిణాది ప్రభుత్వాలు సినిమాలు చూసేలా ధరలను నియంత్రిస్తోంది. సరసమైన ధరలకు సింగిల్ స్క్రీన్‌లు, టికెట్ ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. అప్పుడు ప్రజలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ఆస్కారం ఉంటుంది. కేంద్రం ప్రభుత్వం వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి. ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలోనే వినోదపు పన్ను వేస్తోంది. పన్ను అధికంగా వసూలు చేయడం వల్ల ఓటీటీ, ఆన్‌లైన్ బుక్ ప్లాట్‌ఫామ్‌లు అధిక వసూళ్లు చేపడతాయి. దాని వల్ల ప్రజలకు, సినీ పరిశ్రమలపై పెద్ద ప్రభావం చూపుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుంది.’ అని అన్నారు.