కలసికట్టుగా ఉంటే ఎవరైనా సరే ఎంతటి శక్తివంతమైన వారిని అయినా సరే ఎదిరించవచ్చు. అందుకనే ఓ పద్యం కూడా రాశారు. చీమలన్నీ కలసి కట్టుగా ఉండి ఓ పాముపై దాడి చేసి చంపాయని కవి రాశాడు. అందువల్ల ఎవరైనా సరే కలసి కట్టుగా ఉండాలి. కలసి ఉంటే కలదు సుఖం అని కూడా అందుకే అన్నారు. ఎవరైనా ఒక్కరికి ఆపద వచ్చినా అందరూ కలిసి తోడుగా ఉంటారు కనుక ధైర్యంగా కష్టాలను ఎదుర్కొనవచ్చు. అవును.. సరిగ్గా ఆ గేదెలు కూడా అలాగే చేశాయి.
ఓ సింహాల గుంపు గేదెలపై దాడి చేసే సిద్ధంగా ఉంది. వాటికి కొంత దూరం నుంచి గేదెలు వాటి వైపు రాసాగాయి. అయితే అదే సమయంలో సింహాలు దాడి చేయాలని చూశాయి. కానీ గేదెలన్నీ కలిసి కట్టుగా ఉండి సింహాలను తరిమేశాయి. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
Battle of Waterloo for lions…
United buffalo heard outgunning the lion pride.( Shared by Erik Solheim) pic.twitter.com/6qRpBRIsxe
— Susanta Nanda IFS (@susantananda3) September 25, 2020
ఇక ఆ వీడియోకు ఇప్పటికే 5వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది కామెంట్లు చేశారు. ఇంకెంతో మంది దాన్ని షేర్ కూడా చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అందరూ కలసి కట్టుగా ఉంటే ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కొనవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?