Bullet Bhaskar: బుల్లెట్ భాస్కర్‌ ఆత్మహత్య.. తలకు తీవ్రమైన గాయాలు..??

Share

Bullet Bhaskar: కామెడీ స్కిట్స్‌తో అత్యంత ప్రాచుర్యం పొందిన జబర్దస్త్ షోకు పోటీ లేదనే చెప్పాలి. వెకిలి కామెడీ, అసభ్య పదజాలం ఉందంటూ విమర్శలు వస్తున్నా మెజారిటీ ప్రేక్షకులు మాత్రం జబర్దస్త్ షోను ఆదరిస్తున్నారు. అయితే ఈ పాపులర్ కామెడీ షోలో బుల్లెట్ భాస్కర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్, వర్ష, ఫాహిమాల స్కిట్స్ టీఆర్పీ రేటింగ్స్‌తో పాటుగా యూట్యూబ్‌లో వ్యూస్‌ను సైతం అమాంతం పెంచేస్తున్నాయి.

Bullet Bhaskar: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బుల్లెట్ భాస్కర్‌

తాజాగా ప్రసారం అయిన జబర్దస్త్ ఎపిసోడ్‌లో బుల్లెట్ భాస్కర్ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు. తాను ఒక అమ్మాయిని ప్రేమించానని.. ఆ అమ్మాయితో కలిసి ఉన్నానని చెప్పాడు. కొంతకాలం తరువాత తనను ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని బాధగా చెప్పుకొచ్చాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనని వదిలేయడంతో ఆ బాధ నుంచి జీర్ణించుకోలేక తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పాడు. పిచ్చెక్కి రోడ్లపై తిరిగానని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు బుల్లెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ టైమ్‌లో తానేం చేస్తున్నానో తనకే తెలియలేదని.. అప్పుడే తలకు బాగా దెబ్బలు తగిలింది అన్నాడు. తలకు గాయాలు తీవ్రంగా కావడంతో కుట్లు కూడా వేయించుకున్నాని చెప్పి షాక్ కి గురి చేశాడు.

ఆత్మహత్య ఆలోచనను అధిగమించిన భాస్కర్

“ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే ఎవరికైనా ఆ అమ్మాయిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. లేదా తామే చనిపోవాలనిపిస్తుంది. మొదట్లో నాకు అలానే అనిపించింది కానీ అది మాత్రమే సమాధానం అనుకోలేదు. నా ఎదుగుదలతో నన్ను మోసం చేసిన అమ్మాయి మొహంపై కొట్టాలని అనుకున్నాను” అని భాస్కర్ చెప్పారు. అందుకే ఆత్మహత్య ఆలోచనలను అధిగమించి జీవితంలో ఏదైనా సాధించాలని హైదరాబాద్ వచ్చానని.. ఆ సమయంలోనే జబర్దస్త్‌లో కమెడియన్ గా చేసే సువర్ణ అవకాశం వచ్చిందని అన్నాడు. దాంతో తన జీవితం మారిపోయిందని బుల్లెట్ భాస్కర్ చెప్పాడు. అయితే బుల్లెట్ భాస్కర్ మంచి నిర్ణయం తీసుకున్నాడని, ఇప్పుడు నవ్విస్తూ అందరూ తమ బాధలను మర్చిపోయేలా చేస్తున్నాడని నెటిజన్లు పొగుడుతున్నారు.

 


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

30 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

1 hour ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

1 hour ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

2 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

3 hours ago