ట్రెండింగ్ న్యూస్ సినిమా

సుధీర్ కోసం రష్మి తన జీవితంలో ఏడేళ్ళ నాశనం చేసుకుందట..! బుల్లెట్ భాస్కర్ సెన్సేషనల్ కామెంట్స్

Share

ఎన్నో ఏళ్ల నుండి నిర్విరామంగా సాగుతున్న సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ లో అనసూయ వదిలి వెళ్ళిన తర్వాత రష్మి బాగా హైలైట్ అయింది. మొదట్లో మెల్లగా ఆమెకు సుడిగాలి సుదీర్ మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. ఇక ఈ మధ్య కాలంలో జబర్దస్త్ అంటే రష్మీ సుధీర్…. రష్మీ సుధీర్ అంటే జబర్దస్త్ లాగా వ్యవహారం తయారయింది. ఇక పండగ పూట చేసే స్పెషల్ ఈవెంట్ లో కూడా వీరిద్దరి జంట హైలైట్ చేయడం షరా మామూలే అయిపోయింది.

 

మిగిలిన కంటెస్టెంట్ లు కూడా స్కిట్స్ లో వీరిద్దరి లవ్ ట్రాక్ ను విపరీతంగా వాడేసుకొని పంచ్ లు వేస్తూ ఉంటారు. ఇక ఏకంగా ఇద్దరికీ పెళ్లి చేసినట్లు ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేయడం అయితే అన్నింటి కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందింది. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో కూడా బుల్లెట్ భాస్కర్ రష్మి-సుదీర్ ల పై కామెంట్ చేశాడు. వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోలో వీరిద్దరి సంబంధంపై భాస్కర్ కామెంట్ చేశాడు.

స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ ఎవరికోసమో ఏడేళ్ళు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు…. అసలు వాడు వస్తాడో లేదో కూడా తెలియదు…. వచ్చినా ఎలా వస్తాడో కూడా తెలియదు… ఏ రోగాలతో వస్తాడో కూడా తెలియదు అని కామెంట్ చేశాడు. అయితే భాస్కర్ కామెంట్ వేసిన వెంటనే రష్మి సిగ్గు పడిపోవడం మనం చూడవచ్చు.

అంటే ఆ మాటలు సుడిగాలి సుధీర్ గురించి అని అందరికీ అర్థం అయ్యాయి. అయితే తమ మధ్య ఉన్న సంబంధం గురించి వీరిద్దరు ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాడు. కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే ఇదంతా చేస్తున్నారని నిజజీవితంలో మేము జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నారు.


Share

Related posts

ఎనిమిదవ తరగతి లోనే అంటూ బిగ్ బాస్ త్రీ హిమజా షాకింగ్ కామెంట్స్..!!

sekhar

అవినాష్.. నువ్వు గ్రేట్.. రైతుల కష్టాలను ఎంత చక్కగా చూపించావు? ఏడిపించావుపో?

Varun G

ABCD…మ‌ళ్లీ వాయిదా

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar