Siri: బుల్లితెర ఎంటర్మైంట్ బిగ్ బాస్ షో చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ప్రారంభమైన ఈ షో నెమ్మదిగా సౌత్ ఇండియా మొత్తం వ్యాపించింది. ఈ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఎందరికో లైఫ్ ఇచ్చి పాపులర్ చేసింది. బిగ్‌బాస్ షోలో ఎంటర్ అయిన తరువాత కొందరు పాపులారిటీని సాధిస్తే మరికొందరు నెగిటివిటీని మూటగట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. తెలుగు బిగ్‌బాస్ సీజన్-5 లో పాల్గొన్న షణ్ముఖ్, సిరి హనుమంత్ లు నెగిటివిటీనీ మూటగట్టుకున్నారు. దీంతో షణ్ముఖ్ ప్రేమ బంధానికి ముగింపు పడింది. మరోవైపు సిరి హన్మంత్ ప్రేమాయణం కూడా కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తోంది.
Money : ధన ప్రాప్తి కోసం శుక్రవారం చేసుకునే పరిహారం గురించి తెలుసుకోండి !!
Siri: సిరితో శ్రీహాన్ బ్రేకప్..?
శ్రీహాన్ తో సిరికి బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లకముందే నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం తర్వాత సిరికి బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. కాగా.., హౌస్ లోకి వెళ్లిన సిరి, షణ్నుతో క్లోజ్‌గా ఉండటం, పలుసార్లు అతడికి హగ్గులిచ్చింది. బిగ్‌బాస్ ముగిసే దాకా సిరికి మద్దతుగా నిలిచిన ఆమె ప్రియుడు శ్రీహన్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇటీవల సిరితో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేసాడు. కేవలం వారిద్దరూ కలిసి నటించిన వెబ్‌సిరీస్ లకు సంబంధించి ఫొటోలను మాత్రమే ఉంచాడు. దీంతో వీరిద్దరూ త్వరలోనే విడిపోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Money : ధన ప్రాప్తి కోసం శుక్రవారం చేసుకునే పరిహారం గురించి తెలుసుకోండి !!
శ్రీహన్‌కు బిగ్‌బాస్ ఆఫర్..!
బాస్ సీజన్ 6 ఈసారి త్వరగా మొదలవుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఆ కొత్త సీజన్ లో శ్రీహాన్ కనిపించనున్నాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ ఓటీటీ లోకి శ్రీహన్ ను తీసుకురావాలని బిగ్‌బాస్ యూనిట్ ఆలోచిస్తుందట. ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. ఇప్పటికే సిరి వ్యవహారంతో బాధలో ఉన్న శ్రీహాన్ ఈ రియాలిటీ షోకు రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.