వంద పెళ్లిలన్నా చేయొచ్చు కాని ఒక ఇల్లు మాత్రం కట్టలేమని సామేత నాటిదైనా నేటికీ ఆచరణలో మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. ఎంత తక్కువలో తక్కువ ఖర్చు చేసినా లక్షలే దాటుతోంది ఇల్లు కట్టడానికి.. ఎంతో మంది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంటారు. కాని ఆర్థిక పరిస్థితుల వల్ల కొందరి కలలు కళ్లలు అవుతున్నాయి. మరి కొందరు అప్పు చేసి మరీ తమ ఇంటిని నిర్మించుకుంటారు. ఇంకొందరు అప్పు చేసి ఇల్లు కట్టొద్దని అలాగే అద్దె ఇంటిలోనే కుటుంబాన్ని వెళ్లదీసే వారున్నారు.
దాంతో సొంతింటి కల మాత్రం నెరవేరడం లేదు..అయితే మీ సొంతింటి కల నెరవేరడం లేదని బాధపడుతున్నారా? అయితే మీకు అలాంటి బాధ ఇకనుంచి పడరేమో.. చాలా చౌక ధరకే మీ సొంతింటి కలను నిజంచేసుకునే అవకాశం కల్పిస్తోంది ఓ ప్రభుత్వం.. మరింకెందుకు ఆలస్యం వెళ్లి కొనేద్దామనుకుంటున్నారా?? ఆగండాగండి? మీ కా చాన్సు లేదు..
అది కేవలం ఇటలీకే పరిమితం.. కేవలం 86 రూపాయలకే ఇల్లు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది అక్కడి ప్రభుత్వం.. అదేంటి ఎక్కడైనా అంత తక్కువ ధరకే ఇల్లు రావడమేంటని సందేహం కలుగుతోంది కదా.. దానికి ఒక తిరకాసుందండోయ్..1986లో సిసిలోని భూకంపం వచ్చి అక్కడి ప్రాంతాన్ని, జనజీవనాన్ని కనుమరుగు చేసింది. దాంతో అప్పటినుంచి ప్రజలు అక్కడ నివసించడానికి ఆసక్తి కనబరచడం లేదు. అక్కడున్నవారే బతుకుదెరువు కోసం వలసలు వెలుతూనే ఉన్నారు.
అలాగే కొనసాగితే అక్కడ రానున్న రోజుల్లో ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించేసింది. దీంతో నైనా అక్కడ జనావాసం ఏర్పడవచ్చనే అశతో.. అందుకని ఒక్క యూరోకే ఇల్లు పథకం కింద దీన్ని ప్రకటించేశారు. ఒక్క యూరో అంటే భారత కరెన్సీలో 86 రూపాయలని అర్ధం. ఇప్పటికే సలేమీలో నివాసయోగ్యమైన పాత ఇండ్లను గుర్తించి వాటిని వేలానికి సిద్దంగా ఉంచారు. అయితే అక్కడ ఇల్లు కొనాలంటే మాత్రం పాతింటికి మరమ్మత్తులు చేసుకోవడం తప్పనిసరి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?