బాహుబలి వంటి భారీ విజయం తరువాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలో రిలీజ్ ఎప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ. ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ తెలిస్తే గాని ఇండస్ట్రీలో ఉన్న తెలుగు సినిమాలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు.
కరోన రాకముందు ఈ ఏడాది జనవరి 8వ తారీఖున రిలీజ్ చేస్తారని ప్రకటన చేసింది “RRR” సినిమా యూనిట్. దీంతో అప్పట్లో ఇదే పండగకు రావాలని భావించిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కొద్దిగా వెనకడుగు వేయడం జరిగింది. ఎంతలో మహమ్మారి ఎంట్రీ ఇచ్చి అందరి ఆలోచనలను తల్లకిందులు చేసింది. ఈ పరిణామంతో “RRR” రిలీజ్ డేట్ మొదటికొచ్చింది.
ఇప్పటికే రెండు సార్లు అనుకున్న టైంకి ఈ సినిమా రాకపోవడంతో.. మళ్లీ ఈసారి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి ఆ తర్వాత రిలీజ్ వాయిదా పడితే పరువు పోతుందేమో అని ఆలోచనలో రాజమౌళి టీమ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం ఫిబ్రవరిలో కంప్లీట్ అయిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ టైం పట్టే అవకాశం ఉండటంతో.. ఎఫెక్ట్స్ వర్క్ కొలిక్కి వచ్చిన తర్వాతే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో “RRR” టీమ్ ఉంది. ఈ క్రమంలో దసరా పండుగకు అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో రాజమౌళి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నదానిపై బన్నీ“RRR” రిలీజ్ డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్లు టాక్.