Butterfly Asana: ఈ ఆసనం వేస్తే త్వరగా బరువు తగ్గుతారు..!! 

Share

Butterfly Asana: సన్నగా నాజూగ్గా కనిపించాలని అందరికీ ఉంటుంది.. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు.. బరువు తగ్గడం కోసం ఆహారం తినకుండా మానేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారు కొందరైతే.. జిమ్ కి వెళ్తూ డబ్బును ఖర్చు పెట్టే వారు మరి కొందరు.. ఎన్ని ప్రయత్నాలు చేసిన రిజల్ట్ రావడం లేదా.. అయితే సింపుల్ గా ఈ ఆసనం వేయండి.. మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి సులువుగా బరువు తగ్గుతారు..!!

Butterfly Asana: reduces weight loos
Butterfly Asana: reduces weight loos

సీతాకోక చిలుక ఆసనం ద్వారా ప్రాబ్లం కి చెక్ పెట్టవచ్చు.. ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. రెండు పాదాలను మధ్యలోకి తీసుకువచ్చి రెండు కాళ్లవేళ్లను పట్టుకోవాలి. తరువాత కాళ్లను పైకి కిందకు కదుపుతూ 20 సార్లు చేయాలి. ఇలా క్రమంగా చేస్తూ మోకాలిని కూడా నేలకి అనించోచ్చు. ప్రతిరోజు ఈ ఆసనం వేస్తే శరీరం చురుగ్గా మారడమే కాకుండా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. పొట్ట, తొడల దగ్గర ఉన్న కొవ్వు సులువుగా కరుగుతుంది. నడుము సన్నగా మారుతుంది.

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగి ఈ ఆసనం వేయడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు ఉన్నవారు, ఎక్కువ దూరం నడవలేకపోవడం, నడిచిన ఆయాస పడడం, కూర్చోవడానికి ఇబ్బంది పడటం, కూర్చున్న తర్వాత లేవలేక పోవడం ఇటువంటి అన్ని సమస్యలకు ఈ ఆసనం ద్వారా సులువుగా చెక్ పెట్టవచ్చు.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచి మీరు కూడా ఈ ఆసనాన్ని ట్రై చేయండి.


Share

Related posts

బ్రేకింగ్ : మళ్లీ బ్యాన్ చేసిన భారత్…! ఈ సారి 101

arun kanna

NTR : ఎన్టీఆర్ పై నాగబాబు చేసిన కామెంట్ కి అవాక్కయిన నందమూరి ఫ్యాన్స్..!!

sekhar

My Name Is Sruthi: హన్సిక “మై నేమ్ ఇస్ శృతి” సినిమా పూజా కార్యక్రమం..!! షూటింగ్ ఎప్పుడంటే..!!

bharani jella