NewsOrbit
Featured న్యూస్

2023 వరకు ప్రపంచంలో 50 శాతం మంది వద్ద 5జి ఫోన్లే ఉంటాయి..!

కరోనా నేపథ్యంలో గత 5 నెలలుగా స్తబ్దుగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఇప్పుడిప్పుడే మళ్లీ ఊపందుకుంటోంది. కంపెనీలు నూతన ఫీచర్లతో ఆకట్టుకునే ఫోన్లను తయారు చేసి విడుదల చేస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్‌ కూడా పెరుగుతున్నాయి. అయితే 2020 మొత్తంగా చూస్తే స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలకు నష్టం కలిగిందనే చెప్పవచ్చు. కానీ 2021 వరకు అమ్మకాలు మరింత పెరుగుతాయని, ఈ ఏడాది కన్నా 9 శాతం ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 2021లో జరుగుతాయని తెలుస్తోంది. ఈ మేరకు ఐడీసీ (ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌) ఇచ్చిన నివేదికలో ఆ వివరాలు ఉన్నాయి.

by 2023 half of the world population will have 5g smart phones

అయితే 2023 వరకు ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్‌ మార్కెట్‌లో 50 శాతం వరకు 5జి స్మార్ట్‌ ఫోన్లే ఉంటాయని ఐడీసీ నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతానికి 5జి ఇంకా అందుబాటులోకి రానప్పటికీ అప్పటి వరకు ఆ సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ ఏడాది వరకు మార్కెట్‌లో 50 శాతం మంది వరకు 5జి ఫోన్లను వాడుతారని ఐడీసీ అంచనా వేస్తోంది. అప్పటి వరకు 4జి స్మార్ట్‌ ఫోన్ల హవానే కొనసాగుతుందని భావిస్తోంది.

కాగా కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 4జి స్మార్ట్‌ ఫోన్ల ఉత్పత్తి, అమ్మకాలు చాలా వరకు తగ్గినా, మరో రెండేళ్లలో అమ్మకాలు పుంజుకుంటాయని, తిరిగి కోవిడ్‌కు ముందు ఉన్న స్థితికి చేరుకుని దాన్ని దాటి అమ్మకాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. కాగా కరోనా వల్ల ఈ ఏడాది స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు 9.5 శాతం వరకు తగ్గాయని ఐడీసీ నివేదిక తెలియజేసింది. ఇక అనేక దేశాల్లో మొబైల్‌ వినియోగదారులు లో ఎండ్‌ స్మార్ట్‌ ఫోన్లను వదిలి మిడ్‌ రేంజ్‌ ఫోన్ల వైపు చూస్తున్నారని, దీని వల్ల రానున్న రోజుల్లో ఫోన్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే 5జి వచ్చినా.. ఆ టెక్నాలజీ ఉన్న ఫోన్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ ధరలను తగ్గించినట్లయితే స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థలకు లాభం ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పలు మొబైల్‌ తయారీ సంస్థలు 5జి ఫోన్లను విక్రయిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తక్కువ ధరలకే ఈ ఫోన్లు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

author avatar
Srikanth A

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?