భేష్.. బైడెన్.., కొత్త నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు

 

 

అగ్ర రాజ్య ఎన్నికలలో గట్టి పోటీనిచ్చి విజయం సాధించిన జ్యో బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా లో ఎప్పుడు లేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పంధాకి శ్రీకారం చుట్టారు. అన్ని సవ్యంగా ఉంటె జనవరి 20 న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధ్యక్ష పదవి చేపట్టకముందే అయినా తన టీం ను సిద్ధం చేసుకుంటున్నారు.

 

white house communication staff in byden presidency

తాజాగా అయన సారధ్యంలో పదవి బాధ్యతలు నిర్వహించనున్న వైట్ హౌస్ కమ్యూనికేషన్ టీం ను అయినా ప్రకటించారు. ఈ టీంకు సంబంధించి అందరు మహిళలనే నియమించనున్నారు బైడెన్. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు తీసుకొని నిర్ణయాన్ని తీసుకున్న అధ్యక్షుడు గా బైడెన్ చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. ఇప్పటికే వైట్ హౌస్ సెక్రటరీగా 41 ఏళ్ళ జెన్ సాకి ని ఎంపిక చేసారు. ఈమె బరాక్ ఒబామా పాలనలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహారించిన సమయంలో శ్వేతసౌధం డైరెక్టర్ గా పని చేసారు.ఈ విషయం మీద బైడెన్ స్పందిస్తూ, తన పాలనా లో వైట్ హౌస్ కమ్యూనికేషన్ టీం మొత్తం ఆడవాలని నియమించనున్న విషయాన్ని ప్రకటించడం తనకు ఎంతో గర్వంగా ఉంది అని అన్నారు. అర్హతగల, అనుభవజ్ఞులైన సంభాషణకర్తలు తమ పనికి విభిన్న దృక్పథాలను తెస్తారు అని, ఈ దేశాన్ని తిరిగి ఉన్నత స్థితిలో ఉంచడానికి నిబద్ధతతో పని చేస్తారు అని తన అభిప్రాయాన్ని తెలిపారు. జెన్ సాకి తో పాటు మరో ఆరుగురు మహిళలను బైడెన్ తన వైట్ హౌస్ కమ్యూనికేషన్ టీమ్ గా ఎంపిక చేసారు.

ఉప అధ్యక్షురాలు కమల హారిస్ కు కమ్యూనికేషన్ డైరెక్టర్ గా యాష్లి ఇటీనెన్, కమలకు సీనియర్ సలహాదారుగా, స్పోక్స్ మహిళగా సైమన్ సాండ్రస్ ను ఎంపిక చేసారు. వైట్ హౌస్ డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా పిలి టోబెర్ ను.. ప్రిన్సిపాల్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీగా కార్నె జీన్ పీయరీ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అగ్ర రాజ్యానికి కాబోయే మొదటి మహిళా బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా అలెగ్జాండర్ ఎలిజిబెత్ ను ఎంపిక చేసారు. ఇలా అన్ని పదవులకు మహిళలను నియమించటం ద్వారా బైడెన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. దీనితో బైడెన్ ప్రభుత్వంలో మహిళల ప్రాధాన్యత ఎక్కువుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.