NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఢిల్లీలో ఏం జరుగుతుంది…?

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసాయి. సోమవారం రాత్రి మొత్తం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తతలు నడుమ హింస చెలరేగింది. పోలీసులు, నిరసనకారులు మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక పోలీస్ సహా, అయిదుగురు నిరసనకారులు, ఒక అవుతూ డ్రైవర్ ఉన్నారు. మరో 100 మందికి పైగా గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో సుల్తాన్ అనే నిరసనకారుడు చనిపోయాడు. షాహిద్ అల్వీ అనే ఆటో డ్రైవర్ కి కూడా బులెట్ గాయమై మరణించాడు. ఈయనకు నెలరోజుల కిందటే వివాహమైంది. సోమవారం రాత్రి ఆరంభమైన ఈ హింస వలన చాల ప్రాంతాల్లో రాళ్లు రువ్వుకోవడం, నిప్పు పెట్టడం వంటి చర్యలకు దిగారు. ఢిల్లీలోని జఫారాబాద్, మోజే పూర్, శీలం పూర్, చాంద్ బాగ్ ప్రాంతాల్లో హింస జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిం కుటుంబాలే నివసిస్తున్నాయి. చాల ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు నిప్పు పెట్టారు. ప్రజలు ఈ హింసకు బిజెపి నాయకులే కారణం అంటూ వారిపై పోలీసులకు పిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ హింస ఘటనలతో అట్టుడుకుతోంది.

ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో రెండు రోజులుగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. వేలాదిగా మద్దతుదారులు చేరుకొని ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం కొందరు రాళ్లు రువ్వారు. అనంతరం ఒక వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో ఆందోళనల్లో ఉద్రిక్తతలు, హింస ప్రారంభమయింది. రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉందయానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతాలకు ప్రజలు, ఆందోళకాకారులు చేరుకోకుండా పోలీసులు గట్టి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేసారు. శాంతి భద్రతలు పునరుద్ధరించాలని కేంద్ర హోమ్ మంత్రి, ఢిల్లీ లెఫ్టీనెంట్ గవర్నర్ లను కోరారు. “ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో హింస జరిగిందని తెలిసింది. వెంటనే శాంతి భద్రతలు పునరుద్ధరించాలని నేను అపీల్ చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేసారు.

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Leave a Comment