Mudragada: కాపులకు రాజ్యాధికారం..! ముద్రగడ బలంగా కోరుకుంటున్నారా..?

Share

Mudragada: ఆంధ్రప్రదేశ్ కు ‘కులాల కుంపటి’ అనే పేరు ఇప్పటిది కాదు.. ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఉంది. పైకి ఎవరూ చెప్పరు. కానీ, వెనుక జరిగేది ఇదే. ఇందులో ముఖ్యమైంది.. కాపులకు రాజ్యాధికారం. ఉమ్మడి ఏపీలో ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలించారు. ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. కానీ.. కాపులకు ప్రాధాన్యం ఉన్న ఏపీలో వారికి రాజ్యాధికారం ఇప్పటివరకూ అందలేదు.

can mudragada achieve kapu wish

ముద్రగడలో పట్టుదల పెరిగేనా..?

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినా కాలేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. వంగవీటి రంగా మరణానంతరం రాజకీయాల్లో కాపులకు తరుపు ముక్కగా నిలిచింది ముద్రగడ పద్మనాభం మాత్రమే అని చెప్పాలి. అయితే.. ఆయనలోని రాజకీయ అనిశ్చితి కాపులకు కొంత నష్టమే చూకూర్చింది. అయితే.. ప్రస్తుతం ఆయన తన వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఏకంగా.. కాపులకు రాజ్యాధికారం రావాల్సిందే.. అంటూ తనదైన వాదనను వినిపిస్తున్నారు. ఈమేరకు ఆయన రాసిన లేఖ ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేపుతోంది.

పార్టీ పెడతారా..?

‘మన‌దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతి వారికి రాలేదు. తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి. ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచన మన జాతుల వారు ఆలోచనచేయాలి. మన జాతులు జీవితాలు పల్లకీలు మోయడానికేనా..? పల్లకిలో కూర్చోలేమా..? ఇతర గౌరవ, బీసీ, మరియు దళిత నాయకులు సహకారం తీసుకుని బ్లూ ప్రింట్ తయారు చేద్దాము. మనం చేసే ఆలోచనలు, ఆర్బాటాలు, హడావుడి చేయకుండా చాపకింద నీరులాగా భూమి లోపల వైరింగ్ లాగా ఉండాలి. ఇది రాజ్యాంగం కోసం చేసే విప్లవం, శాశ్వత రాజ్యం కోసం. మనం ఎవరికీ వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేట్ జాగీరు కాదు’ అంటూ కాపు, బీసీ, దళితులను ఉద్దేశిస్తూ లేఖ రాశారు. మరి, ముద్రగడ కొత్త పార్టీ పెడతారా..? భవిష్యత్ ఏపీ రాజకీయంలో సామాజీకివర్గాల సమీకరణాలు రాజ్యాధికారాన్ని అందిస్తాయో లేదో చూడాలి.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

20 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

23 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago