Rice: బియ్యం పురుగు  పడుతుందా?ఇలా చేయండి!!

Share

Rice: పురుగులు పట్టకుండా
బియ్యంలో పురుగుల సమస్య అనేది సర్వ సాధారణ విషయం. మరీ పాత బియ్యం ( Rice )  అయితే  కచ్చితంగా పురుగులబెడద ఉంటుంది ఇవి  రైస్ లో కలిసిపోయి ఉంటాయి. కొన్ని సార్లు బాగా గమనిస్తే కానీ తెలుసుకోలేము.   అయితే కొన్ని కొన్ని  జాగ్రత్తలు  తీసుకోవడం వలన బియ్యానికి  పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు.  బియ్యం లో  కాస్త బిరియానీ ఆకు కానీ  కొన్ని వేపాకులు కానీ  వేసుకుంటే పురుగుల బాధ తగ్గుతుంది.

Rice: పల్చని  వస్త్రం లో

బియ్యానికి   పురుగులు   పట్టినప్పుడు లేదా పురుగులు పట్టకుండా ఉండాలన్న కూడా  వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా వేయవచ్చు లేదా ఒక కాటన్  వస్త్రం లో చుట్టి  అయినా బియ్యం లో వేస్తె  సమస్య తగ్గుతుంది. బియ్యం  లో పురుగు  చేరకుండా  అడ్డుకోవడం లో  లవంగాలు    చాలా  బాగా పనిచేస్తాయి. దాని కోసం కొన్ని లవంగాలను తీసుకుని, పొడిగా చేసుకుని ఆ పొడిని  పల్చని  వస్త్రం లో  కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి.   పొడి చేయకుండా లవంగాలను క్లాత్‌లో ఉంచుకొని, బియ్యం మధ్యలో పెట్టిన కూడా   బియ్యానికి  పురుగు పట్టకుండా  ఉంటుంది.

రాళ్ళ ఉప్పు

రాళ్ళ ఉప్పును బియ్యం డబ్బాలో లేదా బియ్యం సంచిలో  వేస్తె  పురుగు  అనేది రాదు.    ఎండిన కాకరకాయ ముక్కలను  ఒక పొడి క్లోత్ లో వేసి  చిన్న చిన్న మూటలుగా  కట్టి బియ్యంలో  పెట్టడం  వలన కూడా  పురుగు పట్టదు.పురుగులు మరి ఎక్కువగా  ఉంటే మాత్రం డబ్బాలను ఎండలో  పెట్టాలి . లేదంటే  బియ్యాన్ని కాసేపు ఎండలో ఆరబోసి  ఎండతగలనీవాలి . పురుగులు పోయాక డబ్బా శుభ్రం  చేసుకుని మళ్ళి బియ్యాన్ని పోసుకోవాలి.


Share

Related posts

కేసీఆర్‌కు జ‌గ‌న్ స్పెష‌ల్ దావ‌త్‌… ఎందుకో తెలుసా?

sridhar

అమరావతి సాక్షిగా జగన్ నయా స్కెచ్.. దీన్ని ఆపడం కష్టమే!

somaraju sharma

smart phone: స్మార్ట్  ఫోన్ వలన కొత్తగా వస్తున్న సమస్యలు  ఇవే… ఇలాంటి లక్షణాలు  మీలో కూడా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి !!(పార్ట్ -2)

siddhu