Pregnant: ప్రెగ్నెంట్ గా ఉండగా పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే పుట్టే పిల్లలు మంచి కలర్ తో ఆరోగ్యంగా పుడతారని చాలా మంది నమ్ముతుంటారు. మన అమ్మమ్మ , నానమ్మ దగ్గర కూడా ఈ విషయాన్ని చాలా సార్లు విని ఉంటాం. అయితే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయపరంగా ఆధారాలు లేవని నిపుణులు తెలియచేస్తున్నారు. కానీ కుంకుమ పువ్వులో ఉండే ఔషధ గుణాలు మాత్రం చాలా అద్భుతమైనవి అని అనేక ఆయుర్వేద గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా మన రక్తాన్ని శుద్ధి చేసేందుకు కుంకుమ పువ్వు ముఖ్య పాత్ర పోషిస్తుంది.
Pregnant: ప్రెగ్నెంట్ గా ఉన్నవారు విషయానికి వస్తే
మన జీర్ణ కోశాన్ని శుభ్రపరచగల శక్తి కుంకుమ పువ్వు లో ఉంది. ఇక ప్రెగ్నెంట్ గా ఉన్నవారు విషయానికి వస్తే కుంకుమ పువ్వు వల్ల వారికి మరిన్ని అదనపు ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలను తగ్గించే గుణాలు కలిగి ఉండడం వల్ల వారికి దీని వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. నిద్రలేమితో ఇబ్బంది పడే గర్భిణులు, పాలలో కుంకుమ పువ్వు చాలా తక్కువ మోతాదులో కలుపుకొని తాగితే మంచిది. సుఖ ప్రసవానికి కూడా ఇది బాగా సహాయ పడుతుంది. అయితే హోమియో వైద్యులు కొందరు మాత్రం గర్భిణులు ఐదవ నెల నుండి మాత్రమే కుంకుమ పువ్వు వాడటం మంచిదని సూచిస్తున్నారు.
గర్భిణులు ఇలాంటివి చేసేముందు ఒకసారి డాక్టర్ను సంప్రదించి సలహా తీసుకోవడం చాలా మంచిది. కుంకుమ పువ్వు ఖరీదైనది. కాబట్టి.. దీని విషయంలో మాత్రం ప్రభుత్వ ఆమోదం పొందిన లైసెన్స్డ్ ట్రేడ్ మార్క్ గల కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు లో జరిగిన కల్తీ కనిపెట్టడం కూడా చాలా తేలిక. మంచి కుంకుమ పువ్వు నారింజ కానీ ఎరుపు రంగు చివర్లో రక్త వర్ణంలో ఉంటుంది. అదే కల్తీ దైతే.. దానిలో తెలుపు లేదా పసుపు రంగు ఛాయలు ఉంటాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?