Subscribe for notification

బర్డ్ ఫ్లూ వచ్చిందంటున్నారు… గుడ్లు, మాంసం తినొచ్చా? తెలుసుకోండి!!

Share

హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ , మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వల్ల వందల సంఖ్యలో పక్షులు చనిపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వాలు వేల సంఖ్యలో కోళ్లను,  బాతులను కల్లింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్ తెలుగు రాష్ట్రల్లోకి కూడా ప్రవేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో గుడ్లు మరియు మాంసం తినడం పై అనేక సందేహాలు వస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)  బర్డ్ ఫ్లూ పై నెలకొన్న అనేక అనుమానాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా పక్షులు ఏవైతే ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ బారిన పడినాయో వాటికి దగ్గరగా ఉండడం, వాటిని ఆహారంగా తీసుకునేడప్పుడు సరిగా ఆ మాంసాన్ని ఉండికించకుండా తినడం వల్ల మనుషులకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా హాఫ్ బాయిల్డ్ మాంసాహారానికి దూరంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించినట్లు తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదని, కాబట్టి ఆహారాన్ని కనీసం 70 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉడికించి తింటే ఏ ప్రమాదం ఉండదని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ వైరస్‌ ప్రభావం అమెరికా, ఆసియా, దేశాల్లో కంటే యూరప్‌ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని వారాలుగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌, నెదర్లాండ్స్‌, జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, స్వీడన్‌, పోలండ్‌, క్రొయేషియా, ఉక్రెయిన్‌లలో బర్డ్‌ఫ్లూ వైరస్ ను కనుగొన్నట్లు యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌(ఈసీడీసీ) తెలిపింది. ఫ్రాన్స్‌లో సుమారు 6 లక్షలకు పైగా కోళ్లను ఈ వైరస్ కారణంగా వధించారు. జర్మనీలో అధికారులు 62వేల టర్కీ కోళ్లు, బాతులను అక్కడి కల్లింగ్ చేశారు. మనదేశంలోకి ప్రవేశించిన బర్డ్ ఫ్లూ జర్మనీనుంచి వచ్చినదేనని అనుమానాలు ఉన్నాయి కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ఆధారాలూ లేవు.


Share
Naina

Recent Posts

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

19 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

50 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

3 hours ago