NewsOrbit
న్యూస్ హెల్త్

డైట్ లో ఉన్నప్పుడు బెల్లం తినొచ్చా?

డైట్ లో ఉన్నప్పుడు బెల్లం తినొచ్చా?

పండగలు వస్తే మన ఇళ్లల్లో కచ్చితంగా బెల్లంతో చేసిన తీపి పదార్ధాలు ఉంటాయి. సహజమైన తియ్యదనంతో ఉండే బెల్లాన్ని ప్రతి రోజూ ఒక్క ముక్క తీసుకున్నా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ప్రతి రోజూ ఒక బెల్లం ముక్కను తినడం వలన నిత్యం యవ్వనంగా ఉండవచ్చు.

డైట్ లో ఉన్నప్పుడు బెల్లం తినొచ్చా?

చక్కెర కంటే బెల్లం ఎంతో మంచిదని మన అందరికి తెలిసిందే… కానీ, ఇపుడు చాలా మంది ప్రజలు బెల్లం కంటే చక్కెరనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బెల్లం తియ్యగా ఉండడమే కాకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బెల్లంలో ఖనిజాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజూ బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు రక్తహీనత సమస్య ఉంటే బెల్లంతో దానికి చాలా తేలికగా చెక్ పెట్టవచ్చు.

శీతాకాలం మరియు వర్షాకాలంలో జలుబు చేసినప్పుడు ఒక ముక్క బెల్లం తీని గోరువెచ్చని నీరు తాగితే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది ప్రాథమిక చికిత్సగానే కాకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ప్రతిరోజు ఒక బెల్లం ముక్కని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు.

బెల్లం మీ ముఖంపై ఏర్పడే మచ్చలు, చర్మంపై ముడతలను తొలగించిమంచి చర్మానికి మంచి నిగారింపుని ఇస్తుంది. రోజూ బెల్లం ముక్క తినడం వలన వెంట్రుకలు ఊడిపోయే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

టీ, కాఫీల్లో పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

1. రోజూ బెల్లం తినడం వల్ల గ్యాస్ సమస్యలు మరియు కడుపు ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతాయి.
2. మనకి భోజనం చేసిన వెంటనే ఏదైనా తీపి తినాలి అని అనిపించడం సహజం. అటువంటి సమయంలో ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
3. బెల్లాన్ని తినడం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
4. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధిచేస్తుంది.
5. బాగా నీరసంగా లేదా బలహీనత లక్షణాలు కనిపించినట్లు అయితే శక్తి కోసం వెంటనే బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇలా చెయ్యడం వలన మీ ఎనర్జీ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. ఇలా చెయ్యడం వలన షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసినప్పుడు మీకు అలసటగా అనిపిస్తే వెంటనే ఒక ముక్క బెల్లాన్ని తినండి.
6. పాలల్లో రోజూ బెల్లం వేసుకుని తాగడం వలన గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
7. బెల్లం చర్మానికి నిగారింపును ఇస్తుంది మరియు మొటిమలను సైతం తగ్గిస్తుంది.
8. జలుబు, దగ్గు సమస్యలు ఉన్నప్పుడు బెల్లం వాడితే మంచి ఫలితం ఉంటుంది.

బెల్లం అతిగా తినడం వలన బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. డైట్ లో ఉన్నవారు కొంచెం బెల్లం తీసుకోవడం వల్ల సమస్య ఏమీ ఉండదు కానీ మొతాదుకు మించి తీసుకుంటే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లతో పాటు కొవ్వులు, ప్రోటీన్లు కూడా ఉంటాయి.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk