డిఫాల్టర్ల పాస్ పోర్టులు స్వాధీనం!

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టిన వారి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకునేలా నిబంధనలలో మార్పులు చేయాలని మద్రాసు హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. డిఫాల్టర్లు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు వీలయ్యే విధంగా బ్యాంకులు నుంచి రుణాలు తీసుకుంటున్న వ్యక్తులు పాస్ పోర్టులను సరెండర్ చేసే విధంగా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కోర్టు పేర్కొంది.

రుణం పూర్తిగా చెల్లించేవరకూ పాస్ పోర్టు వారికి తిరిగి ఇవ్వకుండా నిబంధనల్లో మార్పులు చేయాలనీ, అలాగే రుణం తీర్చడంలో విఫలమైతే పాస్ పోర్టును రద్దు చేయాలని సూచించింది. డిఫాల్టర్ల బెడద నిరోధించాలంటే పాస్ పోర్టు నిబంధనల్లో మార్పులు చేయడం ఒక్కటే మార్గమని పేర్కొంది.