Samantha: సమంత.. ప్రస్తుతం ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న పాన్ ఇండియా నటి ఎవరన్నా వున్నారంటే అది సామ్ అనే చెప్పుకోవాలి. విడాకుల అనంతరం సామ్ దశ దిశా పెరిగిపోయాయనే చెప్పుకోవాలి. అప్పటివరకు నత్తనడక సాగుతున్న ఆమె సినిమా కెరీర్ చైతూతో విడాకుల తరువాత తారాస్థాయికి చేరుకుంది. అదేనండీ.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తాజాగా ఈ భామ నటించిన కాతువాకుల రెండు కాధల్ (కన్మణి రాంబో ఖతిజా) సినిమా విడుదల అయ్యి, మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Samantha: అమ్మడు తాజా పోస్టు ఇదే:
సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసే కొటేషన్స్, ట్విట్టర్ లో పెట్టే ట్వీట్స్ కాకరేపుతున్నాయి. తాజాగా చాలా సీరియస్ గా పెట్టిన ఓ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో #asksam పేరుతో అభిమానులతో చిట్ చాట్ చేసింది సామ్. ఇందులో భాగంగా పలువురు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ పోయింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘మీకు ఒకేసారి ఎదురవుతున్న ఎక్కువ ప్రేమ, ద్వేషాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు?’ అని అడగగా, సమంత దానికి సమాధానమిస్తూ.. ‘ఈ ప్రేమ, ద్వేషం లాంటి వాటిలో మళ్ళీ పడకుండా ఉండటానికి ట్రై చేస్తాను. వీటికి చాలా దూరంగా ఉండటం మంచిది’ అంటూ రిప్లై ఇచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నెటిజన్ల రియాక్షన్స్ చూడండి:
ఇలాంటి జవాబుని సామ్ నుండి ఎక్సపెక్ట్ చేయని నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది చైతూని ఉద్దేశించి చేసిన కామెంట్ అని అనగా, కొందరు చైతూని సామ్ ఇంకా మర్చిపోయినట్టులేదు అని పుండుమీద కారం జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతేనేం మరోసారి తన ట్వీట్స్ తో మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది సామ్. నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి కొత్త సినిమాలో నటిస్తోంది సమంత. అలాగే యశోద, శాకుంతల సినిమాలో కూడా చేస్తోంది. అటు బాలీవుడ్లో కూడా సమంత బిజీగా మారింది. అక్కడ కూడా ఇద్దరు హీరోలతో సమంత సినిమాలు చేస్తోంది.