captaincy task is on fire in bigg boss house
బిగ్ బాస్.. ఇప్పటికే సగం ఎపిసోడ్స్ అయిపోయాయి. త్వరలోనే సెమీ ఫైనల్స్ కు అడుగుపెట్టబోతోంది బిగ్ బాస్. దీంతో షో రోజురోజుకూ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ గురించే హాట్ టాపిక్. ఓవైపు ఐపీఎల్ నడుస్తున్నా.. బిగ్ బాస్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే దానికి కారణం… బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలు. ఈ మధ్య హౌస్ లో గొడవలే ఎక్కువవుతున్నాయి. మొన్నటి దాకా ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్లు.. ఇప్పుడు గొడవ పడుతున్నారు. ఇప్పటి దాకా గొడవ పడ్డవాళ్లు.. ఫ్రెండ్స్ అవుతున్నారు. ఏంటో.. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం.
సరే.. అదంతా పక్కన పెడితే… బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతోంది. మొన్నటి నుంచి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెగ టాస్కులను ఇస్తున్నాడు. చివరకు అసలు టాస్క్ వచ్చేసింది. అదే రింగులో రంగు అట. దానికి సంబందించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
ఆ ప్రోమో చూస్తే.. అమ్మ రాజశేఖర్, అరియానా, హారిక.. ఈ ముగ్గురు కెప్టెన్సీ టాస్క్ కు పోటీ పడినట్టుగా తెలుస్తోంది. ఈ టాస్క్ లో భాగంగా.. వాళ్లు వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్ ధరించి.. ఓ రింగులో ఉంటూ ఏదో చేయాల్సి ఉంటుంది. అయితే.. టాస్క్ లో భాగంగా.. ముగ్గురు పోటీ దారులు మాత్రం కొట్టుకోవడం ప్రోమోలో చూడొచ్చు.
ఏంటో.. కెప్టెన్సీ కోసం వీళ్లు ఇలా కొట్టుకుంటున్నారేంటి.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఆ టాస్క్ ఏంటో.. దాని గురించి పూర్తిగా తెలియాలంటే మాత్రం రాత్రి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, అందాల భామ రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పక్కా…