Ganapathi : మనకు నష్టం
ఇంట్లో ఉండే పూజ గది మనల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో కాస్త ప్రశాంతంగా ఉంచే గది… కానీ ఆ గదిలో ఇష్టమొచ్చినట్టుగా విగ్రహాలు, పటాలు పెట్టుకోవడం మంచిది కాదు. దానికి కూడా కొన్ని పద్ధతులున్నాయి . పూజగదిలో మనకు నష్టం కలిగించే వాటిని ముందుగా తీసివేయడం చాలా అవసరం. మన ఇంట్లో గణపతి, ( Ganapathi) సరస్వతి (saraswathi) మాత విగ్రహాలు ఉండటం చాలా మంచిది.. కానీ ఆ దేవుళ్ళు నిలబడి ఉన్న విగ్రహాలు మాత్రం నష్టాన్ని కలిగిస్తాయి అని పండితులు తెలియచేస్తున్నారు.
Ganapathi : పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు
అంతే కాదు పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ లేదా పూజగదిలో కూడా పెట్టకూడదు. పది ఇంచులు మించి ఉండే పెద్ద విగ్రహాలు అరిష్టమని తెలుసుకోండి. ఆ సైజు విగ్రహాలు గుళ్ళల్లో పెట్టుకోవడానికి తప్ప ఇళ్లల్లో పెట్టుకోవడానికి కాదు. మరి కొంత మంది ఆడంబరం కోసం పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు ఇళ్లల్లో పెట్టుకుంటుంటారు. అవేవీ ఇంటికి గాని, మీకు గానీ మంచివి కావు అని పండితులు తెలియచేస్తున్నారు. మీ పూజగదిలో మరీ ఎక్కువ విగ్రహాలు పెట్టకూడదు… మీ కులదైవాలు, మీ ఇష్టదైవాలను ఆరాధించిన మంచి ఫలితం వస్తుంది. విగ్రహాలు మరీ నేల మీద ఉన్నట్టు కాకుండా కాస్త ఎత్తులో ఉండేట్టు అంటే మీరు కూర్చున్నప్పుడు మీ ఛాతీ ఎత్తుకు, దేవుళ్ల పాదాలు ఉన్న ఎత్తుకు సరిపోయేలా పెట్టుకోవాలి.
ఏదైనా వస్త్రం
పూజ చేసేటప్పుడు ఎప్పుడు కింద కూర్చోకుండా చాప గానీ, ఏదైనా వస్త్రం గానీ వేసుకుని కూర్చోవాలి.
మరణించిన మీ పెద్దల ఫోటోలు పూజ గదిలో పెట్టకూడదు. ఎందుకంటే మరణించిన మనుషుల పటాలు పూజగదిలో దేవుడి పటాలు తో పాటు ఉంచడం అనేది దేవుళ్లను, విశ్వశక్తిని అవమానించినట్టే అని అంటారు. మహాభారతంలోని ఏ దృశ్యాన్ని కానీ చిత్రీకరించిన పటాలు కానీ పూజ గదిలో పెట్టుకోకూడదు. విగ్రహాల్లో ఏ విధమైన లోపాలున్నా, విరిగిపోయిన వాటిని పూజించడం అనేది అరిష్ట దాయకం అని ఆధ్యాత్మిక నిపుణులు తెలియచేస్తున్నారు.