food: ఆహారం స్పూన్ తో తింటున్నారా?చేతితో తింటున్నారా?ఇది తెలుసుకోండి!!

Share

food:  స్పూన్స్ వాడకుండా చేతులతో అన్నం తినే వాళ్ళు స్వయానా తమ ఆరోగ్యం తామే కాపాడుకుంటున్నట్టే లెక్క.  స్పూన్ తో, ఫోర్క్ తో ఆహారం తినే వాళ్ల తో పోలిస్తే  చేతులతో ఆహారాన్ని తినేవాళ్లు పూర్తి ఆరోగ్యం గా ఉంటారట. చేతులతో తీసుకుని ఆస్వాదిస్తూ అన్నం తినే వాళ్ళలోరక్త ప్రసరణ పెరుగుతుంది. ఆయుర్వేదం  తెలిపినదాని ప్రకారం.. చేతి వేళ్ల ద్వారా నోట్లోకి ఆహారాన్ని పెట్టుకోవడం  అనేది యోగ ముద్ర.

అది జ్ఞాన అవయవాలు బాగా పనిచేసేలా చేస్తుంది. చేతి వేళ్లతో ఆహారాన్ని పట్టుకుని  తినడం వల్ల, వేళ్లకు ఉన్న నరాలు మెదడుకు  సిగ్నల్ పంపడం వలన   జీర్ణవ్యవస్థకు సంబంధించిన రసాలు జీర్ణాశయంలో విడుదల కాబడతాయి. ఇలా జరగడం వలన  తిన్న ఆహారం చాలా తేలికగా జీర్ణమవుతుంది.మన వేదాలు తెలిపినదాని ప్రకారం,మన గుండెకు,చేతి వేళ్లకు, మూడో నేత్రానికి, గొంతుకు, నాడి కూటమి, ఇతర రూట్ చక్రాకు లింక్ ఉంటుంది. అందుకే.. చేతివేళ్లతో అన్నం తింటే  వాటి పనితీరు మెరుగుపడుతుంది.మన మన నోరు ఎంత వేడి లేదా చల్లని ఆహారం తీసుకోగలుగుతుంది అనే  విషయం  స్పూన్స్ కి ఫోర్క్ కన్నా మన చేతి వెళ్లాకే బాగా తెలుస్తుంది.   ఇంకా చెప్పాలంటే స్పూన్లు, ఫోర్క్ ల కన్నా మన చేతులు చాలా పరిశుభ్రంగా ఉంటాయి.స్పూన్ల కే  బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

చాలా  మంది తల్లులు తమ పిల్లలకు అన్నం  పెట్టాలంటే స్పూన్స్ వాడుతుంటారు. కానీ దానివల్ల ప్రయోజనం కన్నా వారికి హాని ఎక్కువగా ఉంటుంది అని తెలియ చేస్తున్నారు. పిల్లలకు చక్కగా ముద్దలు చేసి పెట్టడం వలన వారు పొట్టకు సరిపడా ఆహారం తింటారు. స్పూన్ తో అలా జరగదు వారి పొట్ట నిండదు.కాబట్టి తల్లులు పిల్లలకు అన్నం  పెట్టేటప్పుడు మాత్రం స్పూన్ అసలు వాడకండి.


Share

Related posts

బాబుగారి బేలతనం ఇలా బయటపడింది!

Yandamuri

Vikram : ‘విక్రమ్’ సినిమాని పక్కన పెట్టి ‘పాపనాశం2’ అంటున్న కమల్ హాసన్..

GRK

తెలంగాణ సీఎం కెసిఆర్ బంధువుల కిడ్నాప్…! నిందితుల్లో ఏపి మాజీ మంత్రి బంధువు..! కిడ్నాప్ కథ సుఖాంతం..!!

somaraju sharma